'టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ, జిల్లా ఎస్పీలు క్రిమినల్ ముఠా'

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైయస్ఆర్ సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని ఆరోపించారు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.


Published on: 10 Jan 2025 16:26  IST

Source From: రాజాజీ