వదినతో అక్రమ సంబంధం... అన్న హత్య...!

వదినతో అక్రమ సంబంధం అన్నదమ్ముల అనుబంధాన్ని చింధ్రం చేసింది. వదిన వరుస అయ్యే మహిళతో శారీరక సంబందానికి అన్న అడ్డంగా ఉన్నాడని భావించి ఏకంగా అతడి ప్రాణాలనే బలితీసుకున్నాడు. కిరాతకంగా మధ్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి అతడి ప్రాణాలను సొంత తమ్ముడే తోడేశాడు. 


Published on: 18 Jan 2025 16:48  IST

తెలంగాణా : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానూ తాండాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండడంతో అన్నకు తమ్ముడు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని భావించిన పోలీసులకు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. 

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నాను తండాలో నివాసం ఉండే చందర్ అనే వ్యక్తికి శంకర్, గోపి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో చందర్ చిన్న కుమారుడైన గోపి ద్విచక్ర వాహనాల చోరీ విషయంలో పోలీసులకు పట్టుబడి చర్లపల్లి జైలులో శిక్షను సైతం అనుభవించాడు. పెద్ద కుమారుడు శంకర్ కి గతంలో పెళ్లి అయి, ఒక కుమారుడు సైతం ఉన్నాడు. అయితే భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో శంకర్ తన భార్యను వదిలిపెట్టాడు. తరువాత మరో యువతని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి ఇంటికి వచ్చిన గోపీ అన్నతోనే కలిసి ఉంటున్నాడు. క్రమంగా అన్న రెండో భార్యతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆమెతో వివాహేతర సంబంధంను కొనసాగిస్తుండటంతో ఈ విషయంలో అనుమానం వచ్చిన శంకర్ తమ్ముడితో పలుసార్లు గొడవ పడ్డాడు. నిత్యం మధ్యం తాగి ఇంటికి వస్తుండే శంకర్ తన తమ్ముడితో ఘర్షణ పడుతుండేవాడు. నిన్న కూడా మద్యం సేవించిన ఇద్దరు అన్నదమ్ములు కొద్దిసేపు వాగ్వాదానికి దిగడంతో ఇరుగుపొరుగు వారు నచ్చ చెప్పారు..అయితే ఆ గొడవను మనసులో పెట్టుకున్న తమ్ముడు గోపి..అర్థరాత్రి నిద్రిస్తున్న అన్న శంకర్ కి, ఇంట్లో కరెంటు బోర్డు నుండి కరెంటు వైర్ తీసి,దానితో అన్న శంకర్ కాలుకు ఒకవైరుని, మరో వైర్ ను చేతుకు చుట్టి షాక్ పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు..శంకర్ అరుపులు విని గమనించిన తండ్రి చందర్,గట్టిగా అరుపులు వేయడంతో తండావాసులు వచ్చి చూడగా, శంకర్ అప్పటికే కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు గుర్తించారు..దీనితో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు గోపి కోసం గాలింపు చేపట్టారు.

Source From: రాజాజీ