తిరుపతి లడ్డూల్లో కల్తీ.. నిజం ఎంత?

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూల తయారీ కోసం వాడే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని చంద్రబాబు చేసిన ఆరోపణ నిజమేనా? నిజంగానే కల్తీ నిజమే వాడారా? అసలు ప్రసాదం తయారు చేయడానికి వాడే పదార్థాలను ఎలా చెక్ చేస్తారు? కల్తీ కి అవకాశం ఉందా?. చిన్న విశ్లేషణ


Published on: 21 Sep 2024 12:52  IST


నెయ్యి సప్లై కు 6 నెలలకు  ఒకసారి టెండర్లు పిలుస్తారు. ప్రతి నెయ్యి ట్యాంక్ ను NABL(National Accreditation Board for Testing and Calibration Laboratories ) వాళ్ళు పరీక్షించి certificate ఇస్తారు. ఆ ట్యాంకు తిరుమల చేరాక టీటీడీలో 3 రకాల పరీక్షలు చేస్తారు. ఏ ఒక్క రిపోర్టులో కొంచెం డివియేషన్ ఉన్నా ట్యాంకర్ ను తిరస్కరిస్తారు. అంతా సరిగా ఉంటేనే ఆ నెయ్యిని వాడతారు. సంవత్సరానికి షుమారు 5 లక్షల టన్నుల నెయ్యి వాడతారు.

2014 -19 లో రిపోర్టులు సరిగ్గా రానందున 14 సార్లు తిప్పి పంపారు. 2019-24 లో 18 సార్లు తిప్పి పంపారు. ఇలా చెక్ చేయటం, కొన్నిసార్లు రిపోర్టులు బాగోపోతే వాటిని తిప్పి పంపటం సర్వసాధారణం. ఇది దశాబ్దాల క్రితమే ఏర్పరచిన వ్యవస్థ.  కాకపోతే అలా వచ్చిన రిపోర్టును కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. చదువు సంధ్య లేని వారు, పెరిగే వయసులో తలకు బలంగా ఈనాడు పత్రిక తగలటం వలన విచక్షణ కోల్పోయిన వారు ఇటువంటి అంశాలను నమ్మి భయపడతా ఉండి ఉంటారు, మరింత అల్లరి చేస్తూ ఉంటారు. ఇటువంటి చిల్లర రాజకీయాల మధ్య అల్లరి అవుతున్నది తిరుమల.

విన్నపం..మీరు దేవుడ్ని నమ్మేవారైనా, నమ్మని వారైనా, ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా....శ్రీవారి లడ్డు మీద, పవిత్రత మీద అనవసర ఆపోహలు సృష్టించి అంతిమంగా తిరుమలకు, రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురాకండి” 

ఒక్క మాటలో చెప్పాలి అంటే గతం లో చంద్రబాబు పరిపాలించిన 5 సంవత్సరాలలో నెయ్యి రిపోర్ట్స్ కొంచెం అటూ ఇటూ ఉన్నై అని 14 సార్లు వెనక్కి పంపారు, Y S జగన్ పరిపాలించిన 5 సంవత్సరాలలో 18 సార్లు వెనక్కి పంపారు. 

అయితే ఎప్పుడూ, ఎవరూ దీన్ని రాజకీయానికి వాడుకోలేదు. తొలిసారి వెంకన్న లడ్డూని రాజకీయానికి ఉపయోగించుకున్నారని స్పష్టమవుతోంది.

Source From: ttd laddu