ప్రపంచ భవిష్యత్ నగరం - హైదరాబాద్ 

హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానం లో ఉండగా, మరో సర్వే ప్రకారం 4వ స్థానంలో ఉంది. బ్రిటీష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా, హైదరాబాద్ టాప్-10 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది. 


Published on: 23 Oct 2024 14:54  IST

ఈ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి. అందరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నై - 2018 లో హైదరాబాద్ యొక్క GDP సుమారు 50 బిలియన్ ఉండగా, 2033-34 నాటికి 200 బిలియన్స్ కు  చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేవలం పదేళ్లలో నాలుగు రెట్లు వృద్ధి అంటే మామూలు విషయం కాదు. 

హైదరాబాద్ యొక్క వేగంగా పెరుగుతున్న ఎకానమీ, మౌలిక సదుపాయాలు (ఇంఫ్రాస్ట్రక్చర్), జనాభా పెరుగుదల, రాబోయే ప్రాజెక్టుల క్రమం, వీటి ఫలితంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఒక ప్రముఖ స్థానం సంపాదిస్తోంది. గతంలో అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు 50% ఉద్యోగులు ఉండగా, 30% ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండేవారు. అయితే, కోవిడ్ తర్వాత, అనేక అమెరికన్ మరియు యూరోపియన్ కంపెనీలు తమ కార్యకలాపాలను, ఆఫీసులని పూర్తిగా హైదరాబాద్‌కు తరలించాయి/ ఇంకా తరలిస్తున్నారు . ఈ విధంగా కేవలం ఐటీ రంగం మాత్రమే కాకుండా, ఫార్మా, మ్యాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు, మరియు తాజాగా డిఫెన్స్ కంపెనీల రాక కూడా మొదలైంది. ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో 4 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి అంటే హైదరాబాద్ ఎంత కీలకమైనదో ఇది తెలుపుతుంది.

హైదరాబాద్ కి తూర్పున - LB నగర్, ఉప్పల్, చౌటుప్పల్, 
హైదరాబాద్ కి పడమర -  పఠాన్ చెరువు, హైటెక్ సిటీ, కొండాపూర్  
హైదరాబాద్ కి దక్షిణాన - తుక్కుగూడ, శంషాబాద్, మహేశ్వరం
హైదరాబాద్ కి ఉత్తరాన - కొంపెల్లి, శామీర్ పేట్, మేడ్చల్ ఉన్నై.

ప్రధానం గా ఎక్కువ కంపనీలు దక్షిణాన ఎయిర్ పోర్ట్ తుక్కుగూడ నుంచి పడమర పఠాన్ చెరువు బెల్ట్ వరకు ప్రస్తుతం ఎక్కువ గా ఉన్నై. తూర్పున ఉప్పల్ లో ఇన్ ఫోసిస్, ఆదిభట్ల లో TCS ఉన్నై కానీ పూర్తి స్థాయిలో కంపనీలు రాలేదు. భవిష్యత్ లో ఉత్తరాన కొంపెల్లి సైడ్ కూడా కంపనీలు వస్తే బాగుంటుంది (కనీసం కొంపెల్లి, మేడ్చల్ వైపు IIM (Indian Institute of Management) తీసుకు వచ్చినా ఆ తర్వాత మిగతా కంపనీలు అన్నీ అటువైపు రావటానికి స్కోప్ ఉంటుంది) 

వీటికి తోడు ORR కి, RRR కి మధ్య రింగ్ మెట్రో. RRR కి వెలుపల RRR ఆనుకొని రింగ్ రైలు ప్రాజెక్ట్ రాటానికి స్కోప్ ఉంది. వీటికి తోడు బొంబాయి నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ బులెట్ ట్రయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 

హైదరాబాద్ నుంచి కంపనీలు అమలాపురానికి వెళ్ళవు, అహ్మదాబాద్ వెళ్ళవు - ప్రపంచ వ్యాప్తం గా ఏ సర్వే తీసుకున్నా వేగం గా అభివ్రుద్ధి చెందే నగరాల్లో హైదరాబాద్ టాప్ 10 లోపే ఉంది. అందుకే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, ఉండాలనుకున్న వాళ్ళు వెంటనే కనీసం ఒక అపార్ట్ మెంట్ తీసుకోండి ప్రపంచ భవిష్యత్ నగరంలో.

Source From: hyderabad