డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు


Published on: 24 Nov 2024 13:29  IST

కూటమి ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ డిసెంబర్ 2వ తారీఖున విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రం అంత కొత్త రేషన్ కార్డు, పేర్లు తొలగింపు, నమోదు, పెళ్ళైన వారిని ప్రస్తుతం ఉన్న కార్డు నుండి తొలగించి వారికి కొత్త కార్డు మంజూరు, తప్పుగా పడిన పేర్లు, చిరునామా మొదలైన్ కరెక్షన్స్ అన్నీ కూడా స్థానిక సచివాలయంలో GSWS సర్వీసెస్ నందు మొదలువ్వబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 28వ తారీఖు వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. స్థానిక సచివాలయంలోనే విచారణ జరిపి ప్రోసెస్ చేసి అర్హులైన ధరఖాస్తుదారులందరికి సంక్రాంతి పండుగ కంటే ముందే రేషన్ మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Source From: New ration cards