టీడీపీ నేత ట్వీట్‌ చేశాడు.. ఆమె పోస్టు ఊస్టింగ్‌ అయింది

ఏ ప్రభుత్వం ఉన్న కొందరు ఉన్నతాధికారులకు ఇబ్బందులు తప్పవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీకి బాగా సపోర్ట్‌ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వంటి కొందరు అధికారులను వేధించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్‌సీపీకి సపోర్ట్‌ చేసిన అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.


Published on: 14 Aug 2024 19:00  IST


 తాజాగా అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా ఇటీవల పోస్టింగ్‌ పొందిన డి హరితను ఉన్నట్టుండి వెనక్కి రప్పించారు. ఆమె పోస్టింగ్‌ను రద్దు చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకు ఆమె పోస్టింగ్‌ రద్దయిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!. టీడీపీ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి ఆమె పోస్టింగ్‌పై ఎక్స్‌లో ఒక ట్వీట్‌ పెట్టారు. హరిత అవినీతి అధికారి అని, ఆమె నెల్లూరు కమిషనర్‌గా పని చేశారని, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడి టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి రూపకర్త ఆమేనని ఆయన ట్వీట్‌ సారాంశం. అలాంటి అధికారికి ఇప్పుడు జేసీగా పోస్టింగ్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అంతే రెండురోజుల్లో ఆమె ఉద్యోగం ఊడిపోయింది. గతంలోలా చంద్రబాబు ప్రభుత్వం. ఆ పార్టీ నాయకులు ఏదైనా చెబితే వెంటనే చేసేస్తున్నారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వ్యవసాయ, మైనింగ్‌ శాఖ కార్యదర్శి నుంచి అప్రాధాన్యమైన యువజన వ్యవహారాల శాఖకు మార్చారు. అది అప్రాధాన్య పోస్టు అయినా అది ఆయనకు ఎందుకివ్వాలని టీడీపీ సోషల్‌ మీడియా, కొందరు టీడీపీ నేతలు, మీడియా ప్రశ్నించాయి. దీంతో ఆయన్ను ఆ పోస్టు నుంచి చంద్రబాబు పీకేశారు.
 

Source From: ap news tdp ias