మళ్లీ వైఎస్సార్సీపీకే అధికారం : జన్ మత్ సర్వే


Published on: 26 Feb 2024 23:12  IST

రాబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని మరో సర్వేలో తేలింది. తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపితో కలిసి పోటీ చేసినా మొగ్గు వైఎస్సార్సీపీకే ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ సర్వే సంస్థ జన్ మత్ ఇటీవల ఏపీలో విస్తృతంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

వైఎస్ఆర్సీపీ 114 - 115 అసెంబ్లీ సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడుతుందని పేర్కొంది. టీడీపీ - జనసేన కూటమి 55 - 57 అసెంబ్లీ సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది.

ఎంపీ సీట్లు ఎక్కువ వైఎస్సార్సీపీకి వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఆ పార్టీ 16 నుంచి 18 సీట్లలో గెలుస్తుందని స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కూటమి 7  నుంచి 8 సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొంది.

 

 

 

Source From: Janmath