నేను నీతివంతుణ్ణికాదు.. డబ్బులు తీసుకున్నా : బాలినేని సంచనలన వ్యాఖ్యలు


Published on: 09 Dec 2023 21:17  IST

    తాను నీతి మంతుడినని చెప్పడం లేదని, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సొంత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

     వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావాలని తన కొడుకు తపన పడుతున్నాడని చెప్పారు. జగన్‌కు కూడా తమ మీద అభిమానం ఉండాలి కదా అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్‌ వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ తాను పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీచేస్తానని, మరో నియోజకవర్గానికి వెళ్లనని స్పష్టం చేశారు. అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పానని తెలిపారు. 

    తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టానని చెప్పారు. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగి తమ అబ్బాయి బీఆర్‌ఎస్‌ వస్తుందని చెప్పాడని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వస్తే ఏపీలో వైఎస్సార్‌సీపీ వస్తుందని మా అబ్బాయి తపనపడ్డాడని అన్నారు. మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం రద్దుచేసుకున్నానని తెలిపారు. 


 

Source From: balineni