హోం శాఖ రేవంత్‌ చేతిలోనే.. మంత్రులకు శాఖలు ఖరారు

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత సోనియా, రాహుల్‌ సూచనల ప్రకారం శాఖలు నిర్ణయించారు. హోం శాఖను రేవంత్‌ తన వద్దే ఉంచుకోవడడం విశేషం. పోలీసు శాఖను తానే నిర్వహించాలని నిర్ణయించుకోవడం ద్వారా ప్రత్యర్థులపై ఆయన గురి పెట్టినట్లేనని అర్థమవుతోంది. మున్సిపల్‌ పరిపాలన శాఖను కూడా ఆయన తన కిందే ఉంచుకున్నారు.


Published on: 09 Dec 2023 21:14  IST

మంత్రులకు కేటాయించిన శాఖలు

భట్టి విక్రమార్క మల్లు 
    1. ఆర్థిక, ప్రణాళిక
     2. ఇంధన శాఖ

నలమడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
    1. నీటిపారుదల శాఖ
    2. ఆహారం, పౌరసరఫరాలు

దామోదర రాజనరసింహ 
    1. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
    2. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
    1. రోడ్లు, భవనాలు
    2. సినిమాటోగ్రఫీ

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
    1. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ 
    2. పరిశ్రమలు, వాణిజ్యం
    3. శాసనసభా వ్యవహారాలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
    1. రెవెన్యూ
    2. గృహ నిర్మాణం
    3. సమాచార పౌర సంబంధాలు

పొన్నం ప్రభాకర్‌ 
    1. రవాణా
    2. బీసీ సంక్షేమం

కొండా సురేఖ
    1. అటవీ, పర్యావరణం 
    2. దేవాదాయ శాఖ

అనసూయ సీతక్క 
    1. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా 
    2. స్త్రీ శిశు సంక్షేమ శాఖ

తుమ్మల నాగేశ్వరరావు 
    1. వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం 
    2. హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ 


జూపల్లి కష్ణారావు 
    1. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ 
    2. పర్యాటకం, సాంస్కృతి శాఖ, ఆర్కియాలజీ


 

Source From: revanth