యూత్ లీడర్ నుంచి సీఎం వరకు.. రేవంత్ రెడ్డి ప్రస్థానం

రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి పీఠాన్ని రేవంత్ రెడ్డి అధిరోహిస్తుండడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పనిచేసిన రేవంత్ ఇప్పుడు అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పదవిని అలంకరిస్తుండడం విశేషమే.


Published on: 06 Dec 2023 02:07  IST

విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ ఏబీవీపీ నాయకుడిగా పని చేశారు. చదువుకునే రోజుల నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. ఆ తర్వాత జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అక్కడి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ రాణించారు. చివరికి గొప్ప వ్యక్తులకి సైతం దని అత్యున్నతమైన సీంఎం పదవిని దక్కించుకున్నారు.

రేవంత్ జీవిత విశేషాలు

రేవంత్ రెడ్డి పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించారు.

తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు.

2006లో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు. తొలిసారి మిడ్జిల్ మండలం జడ్పీటీసి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.


  కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం అప్పట్లో సంచలనమే.

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్య్రంగా పోటీ చేసి ఎన్నికయ్యారు.

2008లో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం.
2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గాను పని చేశారు.

2017 అక్టోబర్ లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేశారు. నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభలో పాల్గొన్నారు.

కొడంగల్‌ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేశారు.

కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన రేవంత్ రెడ్డి తన చివరి లక్ష్యమైన సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నారు.
 

Source From: Revanth