కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.. మళ్లీ పుంజుకుంటాం : కేటీఆర్


Published on: 03 Dec 2023 15:21  IST

తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపిన కేటీఆర్ తాము మళ్లీ తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

" బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక పాఠంగా  తీసుకుంటాం. తిరిగి మళ్ళీ పుంజుకుంటాం.
ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

Source From: Ktr