తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క సంచలనం

తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పేరు మార్మోగుతోంది. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదంటూ గేదెలు కాస్తూ బతుకుతున్నానంటూ గతంలో ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయింది. ఇప్పుడు ఆమె నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె విడుదల చేసిన మేనిఫెస్టో  ప్రధాన పార్టీలను తలదన్నేలా ఉంది.


Published on: 25 Nov 2023 10:40  IST






   బర్రెలక్కగా పిలుస్తున్న ఈ 26 ఏళ్ల యువతి అసలు పేరు కర్నె శిరీష. బర్రెలు కాస్తూ ఆమె పెట్టిన వీడియోతో బర్రెలక్కగా మారింది. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియో చేసిందని అప్పట్లో ఆమెపై పెద్దకొత్తపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

  శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తి చేశారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు పోరాటం చేస్తానని ప్రచారం చేస్తున్నారు. ఆమెను ప్రస్తుతం యూట్యూబ్లో 1.66 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్లో 5.97 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.12 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలో రూ.1,500, చేతిలో మరో రూ. 5,000 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో పలువురు ఆమె ప్రచార ఖర్చులకు సాయం చేస్తున్నారు. శిరీషకు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. శిరీష తల్లి పెద్దకొత్తపల్లిలో చిన్న హోటల్ నడుపుతున్నారు. వీరి కుటుంబానికి అదే జీవనాధారం.

   ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలెక్కను వెలువరించడానికి ప్రధాన పార్టీలు ఆప సోపాలు పడుతున్నాయి. ఆమె ఎవరికి ఓటు హక్కు గండి కొడుతున్నానని బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రచారం చేస్తుండగా దాడి కూడా జరిగింది. ఆమె తమ్ముడు ని కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె ఏడుస్తూ పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. తనకు భద్రత కల్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఎందుకు కోర్టు సంబంధించిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు వైరల్ అయ్యేందుకు సహకరిస్తున్న ఒక ఐటీ ఉద్యోగి ఉద్యోగం సైతం ఊడిపోయింది. దీన్నిబట్టి అర్థమవుతోంది కదా.. బర్రెలక్కను చూసి ఎవరో తెగ భయపడుతున్నారని..

Source From: Barrelakka