మోడీ మళ్లీ ఎన్నికల వాగ్దానాలేనా?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు దూకుడు పెంచాయి. అందరికంటే ముందే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది.


Published on: 03 Oct 2023 16:18  IST

కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి పెద్దలు అమిత్ షా, నడ్డాలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ నెల ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ తెలంగాణలో రెండు కీలక ప్రకటనలు చేశారు. ఒకటి ములుగు జిల్లాలో 900 కోట్ల రూపాయలతో ఎస్టి యూనివర్శిటీ, రెండు తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటన చేయడం బిజెపిలో జోష్ పెంచింది. 2014 ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ పార్లమెంటు  టీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎంపీ అయినప్పటికీ పసుపు బోర్డు మాత్రం తీసుకురాలేకపోయాయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రస్తుత బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ వోటర్లకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎన్నికల వేళ సాక్షాత్తు  ప్రధాని పాలమూరు సభకు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇంతకు ముందు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క అంటూ బిజెపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో  నిజామా బాద్ బిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్  కేంద్ర పెద్దలతో పసుపు బోర్డుపై పై కీలక ప్రకటన చేయించడం  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కవిత పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు. దీనికి కౌంటర్ గా ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ప్రకటన చేయించడం వచ్చే ఎన్నికల్లో బిజెపికి సానుకూల అంశమైతే బిఆర్ఎస్ కు పెద్ద షాక్ అయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విభజన హామీలను బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదన్న ఆరోపణలు కొత్తగా తెరమీదికొస్తున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8 తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఖాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ సెంటర్ సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ఏప్రిల్‌లో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సహా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.
అప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు.
అప్పట్లో  ప్రధాని వరుస పర్యటనలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటోంది.  వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గతంలో ప్రకటించారు.
చెప్పినట్లుగానే ఎవరూ హాజరుకాలేదు.
దీనిపై ప్రధాని సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు బహిష్కరించాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఏమిటి? వాటిల్లో ఏ మేరకు నెరవేరాయి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.దీన్ని ఖాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ చెప్పింది.దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో నిధులు కేటాయించలేదు.ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు. దీనికితోడు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే.. ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది.అది వ్యాగన్ల మరమ్మతుల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
వ్యాగన్ల తయారీ కేంద్రం అడిగితే వ్యాగన్లకు మరమ్మతులు చేసే వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం 2009 నుంచే  పెండింగులో ఉంది.

తొలిసారిగా ఆ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఖాజీపేట రైల్వే కోచ్ తయారీ ‌ప్యాక్టరీ అంశం ప్రతిపాదించారు .

అలా అప్పట్నుంచి పెండింగులో ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును చట్టంలో ప్రతిపాదించింది.తర్వాత బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని బీ‌‍ఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు తెలంగా‌‍‌‍‌‍ణకు కేంద్ర ప్ర‌‍‌భుత్వం ఇచ్చిన ‌‍‌హామీలపై తేల్చాలి అని బిజెపి యేతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రిపేర్ల ‌షాపు పెడుతున్నారని విమర్శించాయి. తెలంగా‌‍ణకు కేటాయించిన కోచ్ ‌ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని విమర్శిస్తున్నాయి.ప్రధాని అంటే గుజరాత్ కు కాదు, యావత్ దేశానికి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. 

Source From: మోడీ