ఏపీలో ఒకే రోజు రిటైర్‌ అయిన 7 వేల మంది 


Published on: 01 Aug 2024 21:18  IST

 

 రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు జరిగాయి. సుమారు 7 వేల మంది ఈ ఒక్కరోజులో రిటైర్‌ అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్, గ్రాట్యుటీ వంటివి సెటిల్‌ చేయాల్సివుంటుంది. ఉద్యోగుల స్థాయిని బట్టి ఇవి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటాయి. ఒక నెలలో వెయ్యి మంది రిటైర్‌ అయితే వారి అకౌంట్‌ను సెటిల్‌ చేయాలంటే కోట్ల రూపాయల సొమ్ము ఇవ్వాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఆదాయాలు లేక అప్పులపైనే నడుస్తుండడంతో అంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితులు లేవు. దీంతో ఆ గండాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వాలు ఉద్యోగుల సర్వీసును పొడిగిస్తూ వస్తున్నాయి. మామూలుగా అయితే 60 సంవత్సరాలకు రిటైర్‌మెంట్‌ ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో పదవీ విరమణ వయసును 2019–24 మధ్య రెండేళ్లు పెంచింది. ఆ గడువు ఈ జులై నెలాఖరుతో ముగిసింది. దీంతో పదవీ విరమణలు ఇప్పుడే ఎక్కువగా జరిగాయి. 

 

Source From: Telugu Peoples