భారతీయులు ఫోన్‌ బానిసలయ్యారు

భారతదేశంలో గత 13 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని, ఇది మనుషుల ప్రవర్తనల్లో గణనీయమైన మార్పుకు కారణమైనట్లు బెస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.


Published on: 18 Feb 2024 11:01  IST


    

నివేదికలోని అంశాలు


    భారతీయుల్లో 31 శాతం మంది లేవడంతోనే స్మార్ట్‌ఫోన్లకు అంకితమైపోయారు.


     84 శాతం మంది యూజర్లు నిద్రలేచిన మొదటి 15 నిమిషాల్లోనే తమ ఫోన్లను చెక్‌ చేస్తున్నారు.


    సగటున ఒక స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌ ఒక రోజులో 70–80 సార్లు పికప్‌ చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 


    అవసరం లేకున్నా వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇది రోజూ వారీ దినచర్యల్లో గణనీయమైన మార్పుకు కారణమవుతోంది.
 
    చౌక డేటా, స్మార్ట్‌ ఫోన్ల లభ్యత కారణంగా యూజర్లు ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 71 శాతం ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. మొబైల్‌ ఫోన్ల వాడకం టైమ్‌ 2 గంటల నుంచి 4.9 గంటలకు పెరిగింది. ఇందులో 50 శాతం స్ట్రీమింగ్‌ కంటెంట్‌ చూడటానికి కేటాయిస్తున్నారు.

    అధిక స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వ్యసనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలపై తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదిక ప్రకారం, అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 17వ స్థానంలో ఉంది. దేశంలో 94 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    వయస్సు, జెండర్, ఆదాయం, జోన్, నగరాల్లో ఉండే వారిని పరిగణలోకి తీసుకుని 30 రోజుల వ్యవధిలో 1,100 మంది యూజర్ల నుంచి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగ డేటాను అధ్యయనం చేసి విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. 
 

Source From: phone addiction