ముందే వచ్చిన వేసవి

ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతానం మొదలైంది.


Published on: 10 Feb 2024 11:43  IST

ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ వాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల సగటు ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్దవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమో దవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.

పెరగనున్న వేసవి తీవ్రత రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతోపాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని కొన్ని రోజులు ఆసాధారణ ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎలినినో బలహీనపడి లానినో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే అఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు

Source From: Temperature