ఐదుగురు గ్రేట్‌ మదర్స్‌

సృష్టికి మూలం అమ్మ. ఆమె లేకపోతే మనిషికి జన్మే లేదు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకూ ప్రతి మనిషికి అమ్మే సర్వస్వం. అమ్మల పాత్ర అంతవరకేనా.. ఏమాత్రం కాదు.. మనల్ని మనుషులుగా తయారు చేస్తున్న తల్లులు తలచుకుంటే కొండల్ని పిండి చేయగలరు.. రాళ్ల నుంచి రత్నాలు తయారు చేయగలరు. ఈ విషయం ఎన్నో ఏళ్ల నుంచి.. ఎన్నో సార్లు రుజువైంది. అలాంటి అమ్మల్లో కొందరు చరిత్రను తిరగరాశారు. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఆడది వంటింట్లో ఉండాలనే కంపు కొట్టే వ్యవస్థ నుంచి వికసించి ఏ తరంలోనైనా గొప్పగా చెప్పుకునేలా ఎదిగిన మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. మన దేశంలో అలా చరిత్ర సృష్టించిన ఐదుగురు తల్లుల గురించి తప్పక తెలుసుకోవాలి.


Published on: 05 Dec 2023 13:39  IST

ఆనందీ గోపాల్‌ జోషి : మొదటి మహిళా డాక్టర్‌ 

HISTORY - Anandi Gopal Joshi was one of the first Indian female physicians.  She was the first female of Indian origin to study and graduate with a  degree in medicine in the

    మన దేశంలో మొట్ట మొదటి మహిళా డాక్టర్‌. యూనైటెడ్‌ స్టేట్స్‌ నుంచి వెస్ట్రన్‌ మెడిసిన్‌లో డిగ్రీ చదివిన తొలి భారతీయ మహిళ. 1988లో ఆమె డాక్టర్‌ అయింది. తొమ్మిదేళ్ల వయసులోనే పెళ్లయిన ఆనందీకి 14 ఏళ్ల వయసులో ఒక బాబు పుట్టాడు.  కానీ సరైన వైద్యం అందక చనిపోయాడు. కన్నీరు మున్నీరైన ఆమె అప్పుడే డాక్టర్‌ అవ్వాలని నిర్ణయించుకుంది. తన లాంటి బాధ తల్లులకు రాకుండా ఉండాలంటే మహిళలు వైద్య రంగంలో ఉండాలని నమ్మింది. ఆనందీ భర్త గోపాల్‌రావు అభ్యుదయవాది కావడంతో ఆమెను ప్రోత్సహించాడు. అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు భరించి, ఎన్నో త్యాగాలు చేసి యూఎస్‌లోని వుమెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో డాక్టర్‌ కోర్సు పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక డాక్టర్‌గా ఇండియా తిరిగి వచ్చింది. అప్పటి కొల్హాపూర్‌ స్టేట్‌లోని ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ హాస్పటల్‌లో ఫిమేల్‌ వార్డ్‌కి ఇన్‌ఛార్జి ఫిజీషియన్‌గా ఆమెకు పోస్టింగ్‌ వచ్చింది. ఆధునిక భారత దేశంలో ఆమె తొలి మహిళా డాక్టర్‌.. 
    కానీ క్షయ వ్యాధి ముదిరిపోవడంతో 21 సంవత్సరాల వయసులోనే ఆమె చనిపోయింది. డాక్టర్‌ కోర్సు చదవాలని నిర్ణయించుకోవడానికి ముందే ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినా ఆమె పట్టుదలతో మెడికల్‌డిగ్రీ సాధించింది. ఆనందీ ఇచ్చిన స్పూర్తే ఆ తర్వాత ఎంతో మందిని డాక్టర్లుగా తయారు చేసింది. మహిళలకు వైద్య శాస్త్రం పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. 

జస్టిస్‌ అన్నా చాందీ : తొలి మహిళా జడ్జి

Remembering The Trailblazer Anna Chandy: India's First Woman Judge Of High  Court
    దేశంలో తొలి మహిళా జడ్జి. ఆడవాళ్లు బయటకు వచ్చి చదువుకోవడం కాదు.. మొహం బయట చూపించడానికే భయపడే రోజులవి. అలాంటి మూఢకాలంలో అన్నా చాందీ జడ్జిగా ఎంపికవడం, పనిచేయడం సామాన్య విషయం కాదు. మన దేశంలోని హైకోర్టులో పనిచేసిన తొలి మహిళా జడ్జి కూడా ఆమె. స్వాతంత్య్రం రాకముందే 1937లో  బ్రిటీష్‌ పాలనలో ఆమె జడ్జిగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక 1948లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 1959లో కేరళ హైకోర్డు జడ్జిగా నియమితులయ్యారు. 
    మన దేశంలో తొలి తరం ఫెమినిస్టు అన్నా చాందీ. కోర్టులో ప్రాక్టిసు చేయడానికి ఆమె మగవాళ్లతో పోరాటం చేసింది. తనను ఎదగనీయకుండా చేయడానికి ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి అనుకున్నది సాధించింది. తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వారికి బుద్ధి చెప్పడానికి చివరికి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.
     పురుషుల ఆధిక్యం ఎక్కువగా ఉండి, ఆడవాళ్లను బానిసలుగా చూసే తరంలో వాళ్లపైనే తిరగబడింది. పోరాడింది. నిందలు భరించింది. చివరికి ధైర్యంగా పోటీపడి తాను ఏ మగవాడి కంటె తక్కువ కాదని నిరూపించింది. 1996లో 91 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది. 

కల్పనా చావ్లా : తొలి మహిళా వ్యోమగామి

    Dr Kalpana Chawla | KC Scholars

అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన. 1997లో స్పేస్‌ షటిల్‌ కొలంబియా ఫ్లైట్‌లో ఆమె అంతరిక్షంలోకి వెళ్లింది. 15 రోజుల 12 గంటలు ఆమె స్పేస్‌లో గడిపింది. అప్పటి వరకూ మన దేశం నుంచి ఏ మహిళ అంతరిక్షానికి వెళ్లలేదు. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేసినా అంతరిక్షం వంటి నిగూఢమైన శాస్త్ర సాంకేతిక రంగంలో వారి పాత్ర తక్కువగా ఉండేది. ఆ లోటును తీర్చేలా కల్పనా చావ్లా చేసిన అంతరిక్ష యాత్ర భారతీయ మహిళల గొప్పతాన్ని చాటింది. 
    హర్యానాలోని కర్నల్‌లో పుట్టిన చావ్లా చిన్నప్పటి నుంచే విమానాలు, అంతరిక్షంపై ఆసక్తి చూపేది. తండ్రితో కలిసి లోకల్‌ ఫ్లైయింగ్‌ క్లబ్‌లకి వెళ్లినప్పుడు అక్కడున్న విమానాలు చూసి.. వీటిలో ఒక్క దాన్లోనైనా నేను ఎక్కగలనా అని అడిగేది. కల్పన నాన్న కొద్దిరోజులకి ఆమెను విమానం ఎక్కించి కూతురి కోర్కె తీర్చి తన భారం దింపుకున్నాడు. కానీ కల్పన మాత్రం ఆ విమానాలే తన గమ్యమనుకుంది. పంజాబ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివింది.  అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ చేసింది.  ఏరో స్పేస్‌లో పీహెచ్‌డీ కూడా చేసింది. నాసాలో ఆస్ట్రోనాట్‌గా పనిచేసి తన కల నెరవేరేలా స్పేస్‌లో అడుగుపెట్టింది. 
    2001లో రెండో సారి నాసా స్పేస్‌ మిషన్‌కు ఆమె సెలెక్ట్‌ అయింది.  ఆ మిషన్‌లో ఉండగానే 2003లో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్‌ షటిల్‌ కొలంబియా అంతరిక్షంలోనే పేలిపోయింది. అంతరిక్ష ప్రపంచంలో ఎన్నో సాధిస్తుందనుకున్న కల్పన 42 ఏళ్ల వయసులోనే ఆ ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. కానీ స్పేస్‌లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకుంది. 

ఇందిరా గాంధీ : ఐరన్‌ లేడీ

Indira Gandhi - IMDb

    ఐరన్‌ లేడీగా ఆమెకు పేరు. భారత దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి. ఆమెకన్నా ముందు, ఆమె తర్వాత మళ్లీ ఏ మహిళ ప్రధానిగా ఎన్నికవలేదు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసి ధీశాలి ఇందిర. 1999లో వుమెన్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌గా బీబీసీ నిర్వహించిన పోల్‌లో ఆమె ఎంపికైంది. 
    
    ఇందిర పాలనలో భారతదేశంలో ఎన్నో మార్పులు, సంస్కరణలు వచ్చాయి. 14 పెద్ద బ్యాంకులను ఆమె జాతీయం చేశారు. మహారాజులకు వంశపారంపర్యంగా వచ్చే హక్కులను రద్దు చేశారు. ఖనిజ వనరులైన బొగ్గు, స్టీల్, కాపర్, కాటన్, ఇన్సూరెన్స్‌ పరిశ్రమలను ఆమె జాతీయం చేశారు. 
    1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాను తట్టుకుని నిలబడడమే కాదు విజయం సాధించింది. ఆ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. 
    ఆపరేషన్‌ ఫ్లడ్‌ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం చేపట్టింది. 
    పేదల కోసం ఆమె అమలు చేసిన గరీబీ హఠావో పథకం అప్పట్లో దేశంలో ఒక సంచలనం. 
    ఇందిర హయాంలోనే మన దేశంలో తొలిసారి 1974లో ఫోఖ్రాన్‌లో అణ్వాయుధ పరీక్ష జరిగింది.  ఈ ప్రయోగం వల్లే ఇండియాకు అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం ఉందని ప్రపంచానికి తెలిసింది. 
    కానీ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, ప్రత్యర్థులను అణచివేసేందుకు 1975లో ఆమె విధించిన ఎమెర్జెన్సీ దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ సమయంలో జరిగిన దౌర్జన్యకాండ స్వతంత్య్ర భారత చరిత్రలో ఎప్పూడూ జరగలేదు. ధైర్యానికి, పట్టుదలకు, నాయకత్వానికి ప్రతీకగా ఎదిగిన ఇందిర ఎన్నో విజయాలు సాధించినా ఎమర్జెన్సీ అమెను విలన్‌గా నిలబెట్టింది. అయినా దేశంలో ఇందిరాగాంధీ తెచ్చిన మార్పు ఎవరూ కాదనలేనిది. 1984 అక్టోబర్‌లో సిక్కు తీవ్రవాదులు ఆమెను కాల్చిచంపారు. 

మదర్‌ థెరిస్సా : సేవకు ప్రతిరూపం

Mother Teresa | Canonization, Awards, Facts, & Feast Day | Britannica

    అనాథలు, పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత మాతృమూర్తి. 20వ శతాబ్దంలోని గొప్ప మానవతావాదుల్లో ఆమెదే మొదటి స్థానం. యుగోస్లేవియాలో పుట్టిన మదర్‌ పేదల కోసం ఇండియా వచ్చారు. 12 ఏళ్ల వయసులోనే సేవకు అంకితమై 18వ ఏట సిస్టర్స్‌ ఆఫ్‌ లోరెటో సంఘంలో చేరింది. నన్‌గా మారాక ఆ సంఘం తరఫున 1937లో టీచర్‌గా కలకత్తాలో అడుగుపెట్టింది. అక్కడి మురికివాడల్లో ప్రజల దయనీయ పరిస్థితుల్ని చూసి ఆమె చలించిపోయింది. అప్పటి నుంచి∙మదర్‌  తన జీవితాన్ని వారికి అంకితం చేసింది. అనాథ శరణాలయాలు, ధర్మ శాలలు, హెచ్‌ఐవీ, కుష్ఠు వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు వంటి ఎన్నో ఏర్పాటు చేసి సాంత్వన చేకూర్చింది. ఆమె స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ ప్రపంచానికే దిక్సూచిగా మారింది. 
    నోబెల్‌ శాంతి ప్రైజ్‌ గెలుచుకున్న తొలి మహిళ.    1997 మార్చిలో ఆమె చనిపోయారు. మదర్‌ థెరిసాకు సెయింట్‌హుడ్‌ హోదా కూడా దక్కింది.  ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆమె నినాదం ఆమెను విశ్వమాతగా మార్చింది. ప్రపంచాన్ని మానవత్వంవైపు నడిపించిన మాతృమూర్తిగా ఆమె పేరు ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
    

 

Source From: 5 great mothers