పరుగులు పెడుతున్న బంగారం రేటు


Published on: 04 Dec 2023 21:15  IST

బంగారం ధర ప్రతీ రోజు పరుగులు పెడుతోంది. గడిచిన రెండు రోజుల్లో విజయవాడ మార్కెట్లో 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1250 పెరిగి రూ.64,200కు చేరింది. డిసెంబర్‌ 1న రూ.62,950 గా ఉన్న బంగారం ధర ఒకేరోజు రూ.810 పెరిగి రూ.63,760కు చేరగా తాజాగా సోమవారం మరో రూ.440 పెరిగి రూ.64,200కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారట్ల ఆభరణాల పది గ్రాముల బంగారం ధర రూ.1150 పెరిగి రూ.57,700 నుంచి రూ.58,850కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెరగడానికి కారణమని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Source From: Gold rate