వారానికోసారి చెప్పుల్లేకుండా నడవండి


Published on: 01 Dec 2023 10:24  IST


    వారానికి ఒకసారైనా 1 కిలోమీటరు దూరం చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?
    ఆధునిక కాల జీవన శైలి పేరుతో పడక గదిలో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్న కాలం ఇది. ఉదయం మంచం మీద నుండి దిగింది మొదలు.. మళ్లీ రాత్రి బెడ్‌ మీద పడుకునే వరకూ కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు. వీలైతే స్లిప్పర్లు, శాండిల్స్, స్పోర్ట్స్‌ షూస్‌.. ఫార్మల్‌ షూస్‌ం ఇలా టైమ్‌ను బట్టి ఏదో ఒక పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం. అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్‌ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి

ఎందుకంటే ?

1. శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది.
2. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
3. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది
4. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకుని బి.పి కంట్రోల్‌ అవుతుంది
5. పాదాలు కొత్త స్పర్శను పొందడం వల్ల మైండ్‌ రిలాక్స్‌ అవుతుంది. సహనం పెరుగుతుంది.

మానవుని పాదాల్లో 72 వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి ఉత్సాహంగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడైనా పార్కులు, బీచ్‌లు, ఆఫీసులు, ఇళ్ళల్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

 

Source From: barefoot walking