దీపావళి బిగ్‌ సేల్‌కి ఫ్లిప్‌కార్ట్‌ రెడీ

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు మరోసారి వినియోగదారులను ఊరిస్తున్నాయి. ఆ సంస్థ నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు బిగ్‌ దీపావళి సేల్‌ను ప్రకటించింది.


Published on: 30 Oct 2023 18:22  IST


ఇటీవల దసరా సందర్భంగా బిగ్‌ సేల్‌ నిర్వహించిన ప్రముఖ ఇ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు మరో సేల్‌కు సిద్ధమైంది. నవంబర్‌లో దీపావళి సందర్భంగా ‘బిగ్‌ దీపావళి సేల్‌’ను తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సేల్‌ కొనసాగేది 10 రోజుల పాటు మాత్రమే. నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు ఈ సేల్‌ ఉంటుందని ఆ సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. 

ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ఆఫర్లతో కూడిన సేల్‌ అందుబాటులోకి తెస్తుండటంతో దసరా సేల్‌లో మిస్సయినవారు ఇప్పుడు ఈ ఆఫర్లను వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బిగ్‌ దీపావళి సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనేక రకాల ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుదారులకు 10 శాతం ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్‌ అందిస్తామని పేర్కొంది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ అందించనున్నట్టు తెలిపింది. పేటీఎం యూపీఐ, వ్యాలెట్‌ లావాదేవీలపైనా తగ్గింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 

ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్‌వాచ్, దుస్తులపై అయితే ఏకంగా 80 శాతం వరకు ఆఫర్లు అందించనున్నట్టు సమాచారం. ఇక సూపర్‌ కాయిన్ల ద్వారా అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరింది. ఇంకెందుకు ఈ దీపావళికి ఆఫర్ల ధమాకా అందుకునేందుకు వినియోగదారులూ సిద్ధమైపోండి! 
 

Source From: flipkart