వాట్సప్‌లో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.


Published on: 24 Nov 2024 13:47  IST

వాట్సప్‌లో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది.

వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.

ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ
https:/consumerhelpline.gov.in/
వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో పొందుపరుస్తోంది.

Source From: Consumers protection