న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? - సుప్రీంకోర్టు

లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది.


Published on: 23 Oct 2024 15:06  IST

ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై స్పందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు సైతం ఇచ్చింది.

లా చేస్తూ జర్నలిస్టుగా ఉండకూడదు

బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్పై న్యాయవాది మహ్మద్ కమ్రాన్ వేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓక, జస్టిస్ ఏజీ మసిహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా, న్యాయవాది కమ్రాన్- ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నట్టు ధర్మాసనానికి తెలిసింది. దీనిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

 

బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం.. లాయర్గా ప్రక్టీస్ చేస్తున్న వారు ఇతర వృత్తుల్లో ఉండకూడదు!

"లాయర్ అయినా అవ్వాలి లేదా జర్నలిస్ట్ అయినా అవ్వాలి. ద్వంద్వ పాత్రలను ఒప్పుకోము. ఇది ఎంతో గొప్ప వృత్తి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అని అతను చెప్పుకోకూడదు," అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే, సుప్రీంకోర్టు కమ్రాన్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు! లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న కమ్రాన్ ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తుండటంపై బార్ కౌన్సిల్తో పాటు యూపీ బార్ కౌన్సిల్కి సుప్రీంకోర్టు పలు ఆదేశాలిచ్చింది.

Source From: supreme court