ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికా వెళ్లిన కమల్ హాసన్


Published on: 13 Sep 2024 22:28  IST




ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన తగ్గలేదు. ఆయన అమెరికాలోని టాప్ ఇనిస్టిట్యూట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చదవడానికి అమెరికాకు వెళ్లారు. ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ అధునాతన టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కమల్‌ వెళ్లారని సన్నిహిత వర్గాలు ఓ కోలీవుడ్‌ మీడియాకు తెలిపాయి. 90 రోజుల కోర్సు కాగా ఆయన 45 రోజులే హాజరు కానున్నారు.

Source From: Kamal hasan