వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలివే


Published on: 01 Sep 2024 10:23  IST

– తడిసిన కరెంట్‌ స్థంబాలను ముట్టుకోరాదు.

– తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.

– విద్యుత్‌ లైన్‌కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.

– విద్యుత్‌ లైన్‌కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయాలి

– పార్కులు, స్టేడియంలో విద్యుత్‌ స్తంభాలు ముట్టుకోకూడదు.

– ఇంట్లో ఉన్న స్విచ్‌ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దు. 

– ఇంటి బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.

– కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.

– చిన్న పిల్లలు కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.

– క్వార్టర్‌లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.

– గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్‌ వైర్లను ముట్టుకోకూడదు. 

– ఇంట్లో ఉన్న వాటర్‌ హీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ప్లగ్‌ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకోవాలి. 

– ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్‌ కనెక్షన్‌ తీసివేయాలి. 

– వర్షం కురుస్తున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్‌ స్విచ్‌లను ఆఫ్‌ చేయాలి. లేకపోతే వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌  అయ్యే అవకాశం ఉంటుంది.

– కరెంటు లైన్‌ క్రింద సెల్‌ఫోన్‌ మాట్లాడకూడదు.

– ఇంట్లోకి వచ్చే సర్వీస్‌ వైర్‌ ఏమైన డ్యామేజ్‌ అయితే దానికి సంబంధించిన అధికారి ఒఔM, అఔM, ఔM లేదా అఉకి ఫోన్‌ చేయాలి. 
 

Source From: current shock