ఉపవాసం అంటే శరీరాన్ని శుభ్రం చేయడమే


Published on: 20 Aug 2024 20:36  IST


అన్నం తినకుండా ఫ్రూట్స్‌ తింటే అది ఉపవాసం కాదు. లైట్‌ ఫుడ్‌ తింటే ఉపవాసం కాదు. అరటిపండు లేదా పుచ్చకాయ మాత్రమే తింటే ఉపవాసం కాదు. అసలు ఏమీ శరీరం లోకి వెళ్ళకుండా ఉండటం బ్రెయిన్‌కి మంచిది కాదు (ఏమీ తినకుండా చేసే ఉపవాసం వల్ల మంచి కంటే బ్రెయిన్‌కి చెడే ఎక్కువ)

ఉపవాసం అంటే జీర్ణవ్యవస్థకి శెలవు. ఉపవాసం అంటే చీపురు పట్టుకొని శరీరం లోపల ఊడవటం. చిన్న కొబ్బరి ముక్క తిన్నా, గుళ్లో ప్రసాదం తిన్నా జీర్ణవ్యవస్థ మిషన్‌ నడుస్తుంది కాబట్టి అది ఉపవాసం క్రిందకి రాదు.  

మన శరీరాన్ని మెడ క్రింద, మెడపై భాగంగా చూడాలి. మెడ పై భాగాన ఉండే మన బ్రెయిన్‌లో ఎనర్జీ స్టోరేజ్‌ ఉండదు (బ్రెయిన్‌లో స్టోరేజ్‌ 4 నుంచి 6 గంటలు మాత్రమే), ఏమీ తినకుండా ఉంటే తల నొప్పి వచ్చేది అందుకే. బ్రెయిన్‌కి ఎనర్జీ అందక నొప్పి వస్తుంది. బ్రెయిన్‌కి ఆహారం కావాలి. 

ఉపవాసం చేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో ఒక నిమ్మకాయ, 2–3 చెంచాల తే¯నె వేసుకొని ప్రతి రెండు గంటలకొకసారి తాగాలి. నిమ్మకాయ తేనె కలిపిన వాటర్‌ తాగిన గంట తర్వాత మళ్ళీ నార్మల్‌ వాటర్‌ తాగాలి. అలా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చేస్తే తేనెలో ఉన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌ నుంచి బ్రెయిన్‌కి ఎనర్జీ వస్తుంది. మెడ క్రింద భాగాన ఉన్న జీర్ణ వ్యవస్థ మాత్రం అసలు నడవకూడదు. మెడ క్రింద భాగానికి కావాల్సిన ఎనర్జీ పేరుకుపోయిన కొవ్వుల నుంచి తీసుకుంటుంది. మెడ పైభాగానికి అంటే బ్రెయిన్‌కి తేనెలో ఉన్న మోనో శాకరైడ్స్‌ (ఫ్రక్టోజ్‌ – గ్లూకోజ్‌) నుంచి వస్తుంది. 

సాధారణంగా ఈ విధంగా చేస్తే 21 రోజుల వరకు ఉపవాసం చేయొచ్చు కానీ  2 లేదా మూడో రోజు తల నొప్పి వస్తుంది, అ తర్వాత నుంచి మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో ఎలక్త్రోలైట్స్‌ పాకెట్‌ వాటర్‌లో కలుపుకొని తాగొచ్చు. తాగాల్సిన అవసరం ఉంటుంది. 

మనం ప్రతి రోజూ ఇళ్ళు ఊడ్చుకుంటాం, శరీరం పై భాగానికి స్నానం చేస్తాం. మరి శరీరం లోపల పరిస్థితి ఏంటి..? అక్కడ చీపురు పట్టుకొని ఊడ్చే ప్రక్రియ ఉపవాసం. ఉపవాసం చేస్తే శరీరం లోపల క్లీన్‌ అవుతుంది. నిజానికి వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే డాక్టర్స్‌ని కలవాల్సిన అవసరం చాలా చాలా తక్కువ ఉంటుంది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు.

నెలకి ఒకసారైనా శరీరం లోపల చీపురు పట్టుకొని ఊడవాలి (ఉపవాసం చేయాలి). హిందూ మతం, ఇస్లాం, క్రిస్టియన్‌ ఆదివారం ప్రార్ధనల్లో ఉన్నది అంతా సైన్సే. అయితే శరీరం లోపల హానికర ఫ్రీ రాడికల్స్, హానికర పదార్ధాల గురించి చెప్తే అందరికీ అర్ధం కాదు కాబట్టి సైన్స్‌ని పండగల పేరిట చొప్పించారు. నిజానికి అందరికీ అర్ధం అయ్యేలా మన పూర్వికులు చెప్పి ఉండాల్సింది.  

కుదిరితే వారానికి ఒకసారి మీ శరీరం లోపల చీపురుతో ఊడవండి లేదా నెలకి ఒకసారి అయితే ఖచ్చితంగా ఊడవాలి. అదీ కుదరకపోతే మూడు నెలలకొకసారి ప్రత్యేక పండగలు అప్పుడు, అదీ కుదరకపోతే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా శరీరం లోపల చీపురు పట్టుకొని ఊడవాలి. దాన్నే  ఉపవాసం అంటారు పెద్దలు. 
 

Source From: fasting