ఎన్టీఆర్ ఇరగదీసినా కొరటాల శివ మెప్పించలేకపోయాడు


Published on: 28 Sep 2024 01:27  IST


ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌ర మూవీ భారీ అంచ‌నాల న‌డుమ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ ఇది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ద్వారా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు కొరటాల శివ తన సినిమాలతో సమాజానికి ఉపయోపడే విషయాల్ని చెప్పడంలో సిద్ధహస్తుడు. దేవర చిత్రంలోనూ ఆ తరహా పాయింట్ ను టచ్ చేశాడు కానీ, ఎందుకో అనుకున్నంతగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్టాఫ్ వరకు రచయితగా, దర్శకుడిగా పర్వాలేదు అనిపించుకున్నా.. సెకండాఫ్ లో మాత్రం తేలిపోయాడు. మరీ ముఖ్యంగా ఎప్పుడొస్తుందో తెలియని దేవర పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ కూడా ఆసక్తికరంగా లేకపోవడం గమనార్హం.దేవర, వర పాత్రలను సరిగా ఎస్టాబ్లిష్ చేయకుండా, వాళ్ల గురించి తెలుసుకోవాలంటే రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాలనట్లుగా వదిలేసిన తీరు రచయితగా కొరటాల ప్రతిభకు మచ్చని నా ఒపీనియన్...ఓవరాల్ గా.. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరతో పర్వాలేదనిపించుకున్నాడు కొరటాల శివ. అయితే.. దేవర దర్శకుడిగా, రచయితగా కొరటాల స్థాయికి తగ్గ సినిమా అయితే కాదు..నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ దేవర, వర అనే రెండు పాత్రలలో తనదైన శైలిలో వేరియేషన్స్ చూపించాడు. దర్శకుడు దేవర పాత్ర కొద్దిగా సీరియస్గా చూపించినా కూడా వర పాత్రకు మరింత వినోదం చేరిస్తే  బాగుండేదేమో.అయితే హీరోయిన్ జాన్వి కపూర్ కి ఎన్టీఆర్ తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ.. ఉన్నంతలో ఆమె పరవాలేదు అనిపించింది. ఇక విలన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను ఢీకొట్టే పాత్రలో ఒక రేంజ్ లో నటించాడు. ఇక ముఖ్య పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్, కళయరసన్, షేన్ చాం టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నిజానికి ఈ సినిమాలో చాలామంది పాత్రధారులు ఉన్నారు. వాళ్లని గుర్తుపెట్టుకోవడం వాళ్ళ పాత్రల పేర్లు గుర్తు పెట్టుకోవడమే సినిమా మొత్తం మీద అతిపెద్ద టాస్క్. సినిమా మొత్తంలో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు, డైలాగులు లేకపోవటం.. కొరటాల శివ గత చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లలో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో క్యారీ కాకపోవటం వల్ల  దేవర ఆచార్య రెండో భాగం చూసినట్టే ఉంటుంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే రత్నవేలు ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అనిరుథ్ రవిచంద్రన్ నేపద్య సంగీతం అక్కడక్కడా బాగుంది.అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశాయనే చేశాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి... ఏ రకమైన అంచనాలు లేకుండా సినిమా చూడాలనుకునే వారికి దేవర నచ్చుతాడు ..చివరిగా దర్శకుడు కొరటాల ఎలివేషన్స్ పై పెట్టిన శ్రద్ధ కథనంపై పెడితే బాగుండేది.. మొత్తానికి రాజమౌళి సెంటిమెంట్ పనిచేసిందనే చెప్పొచ్చు..

______

జి. త్రినాధరావు 

Source From: Ntr Devara