బిగ్‌బాష్‌ టైటిల్‌తో మీసం మెలేసిన రైతు బిడ్డ


Published on: 18 Dec 2023 10:24  IST

       సినిమా యాక్టర్లు.. టీవీ ఆర్టిస్టులు.. పెద్ద పెద్ద యూట్యూబర్లు.. వీరందరినీ దాటుకుని బిగ్‌బాస్‌ సీజన్‌ –7 విజేతగా నిలిచాడు ఒక సామాన్య రైతు కొడుకు. అతను బిగ్‌బాస్‌లోకి వెళ్లడమే ఒక అద్భుతమైతే అక్కడ మహా ముదుర్లుగా ఉన్న వాళ్లను కాదని ఏకంగా విజేతగా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌లోకి వెళతానన్నప్పుడు స్నేహితులు అతన్ని హేళన చేశారు. అంత సీను ఉందా.. ఎలా వెళతావ్‌ అని ప్రశ్నించారు. కానీ ఎలాగైనా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే పట్టుదలతో తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆ కోరికను చెప్పి తనకు సపోర్ట్‌ చేయాలని కోరేవాడు. గత మూడు సీజన్ల నుంచి అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళితే అతన్ని పట్టించుకునే వారే కనిపించలేదు. కానీ పట్టు వదలకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. యూట్యూబ్‌లో రైతు బిడ్డగా తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటూ అతను చేసిన పలు వీడియోలు వైరల్‌ అవడం, రైతుల సమస్యలపై చేసిన వీడియోలు అప్పటికే పాపులర్‌ అవడంతో ఎట్టకేలకు అతనికి బిగ్‌బాస్‌ టీం అవకాశం ఇచ్చింది.      


    కామన్‌ మ్యాన్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్‌ రెండు వారాలు ఉండడం కూడా కష్టమనే కామెంట్లు వినపడేవి. కానీ నెమ్మదిగా షోలో తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. కోట్లాది మంది మనసులు గెలుచుకుని విజేతగా అవతరించాడు. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో అర్జున్, శివాజీ, ప్రిన్స్‌ యావర్, అమర్‌దీప్, ప్రియాంక టైటిల్‌ కోసం పోటీ పడ్డారు. చివరికి అమర్‌దీప్, ప్రశాంత్‌లు రేసులో నిలిచారు. జనం ఓట్లతోపాటు ఉత్తమ ప్రతిభ చూపడంతో ప్రశాంత్‌ను హోస్ట్‌ నాగార్జున విజేతగా ప్రకటించాడు. 

Pallavi Prashanth​ Photos: Latest HD Images, Pictures, Stills & Pics -  FilmiBeat
    ప్రశాంత్‌ది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని కొల్గూరు. యూట్యూబర్‌గా, ఫోక్‌ సాంగర్‌గా ఏదో సాధించాలని తపన పడేవాడు. సోషల్‌ మీడియాలో రైతు బిడ్డ పేరుతో వీడియోలు పోస్ట్‌ చేసేవాడు. డిగ్రీ చదివిన ప్రశాంత్‌ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి అందులో ఫోక్‌ సాంగ్స్‌ పోస్ట్‌ చేసేవాడు. ఆ వీడియోలకు ఆదరణ వచ్చినా యూట్యూబ్‌ ఛానల్‌ విషయంలో స్నేహితులతో గొడవ రావడంతో ఛానల్‌ పోయింది. చేతిలో డబ్బు కూడా లేదు. అలాంటి కుంగిపోయిన ప్రశాంత్‌ చనిపోదామనుకుని తండ్రి సత్తెయ్యకు ఆయన అడ్డుకుని ఏం చేయాలనుకుంటే అది చేయాలని చెప్పాడు. అప్పటి నుంచి తండ్రికి తోడుగా వ్యవసాయ పనులకు వెళ్లేవాడు.

Who is Pallavi Prashanth? Wiki, Wife, Biography, Age, Family, Caste, Height  & More
    పొలానికి వెళ్లే క్రమంలోనే వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులు, రైతుల కష్టాలను వీడియోలుగా తీసి సోషల్‌ మీడియాలో పెట్టేవాడు. అతని మాట్లాడే విధానం, శైలి, హావభావాలు నెటిజన్లకు కనెక్ట్‌ అవడంతో అవి వైరల్‌ అయ్యేవి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ షోకి వెళ్లాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ వదలకుండా బిగ్‌బాస్‌ షోకి వెళ్లడమే పనిగా వీడియోలు చేశాడు. హైదరాబాద్‌ వెళ్లి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగేవాడు. మొదటి రెండు సీజన్లు చేతిలో డబ్బులన్నీ ఖర్చు చేసి తిరిగి ప్రయోజనం దక్కలేదు. దీంతో మళ్లీ తన ఊరు వచ్చి తనను బిగ్‌బాస్‌ షోకి పంపాలంటూ నెటిజన్లను కోరుతూ వీడియోలు పెట్టేవాడు. అవి మొదట్లో సిల్లీగా అనిపించిని చివరికి ఆ వీడియోలే అతన్ని బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టేలా చేశాయి. బిగ్‌బాస్‌ టీం అతన్ని సంప్రదించి షోలో కంటెస్టెంట్‌గా తీసుకున్నాయి. రైతు బిడ్డగా బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్‌ అందరినీ మెప్పించి టైటిల్‌ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్‌ చరిత్రలో ఒక కామన్‌ మ్యాన్‌ టైటిల్‌ గెలవడం ఇదే ప్రధమం. విజేతగా నిలిచిన ప్రశాంత్‌కు రూ.35 లక్షల డబ్బు, ఒక కారు, రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణం బహుమతిగా దక్కింది. కాను తన తండ్రికి, ఆభరణాన్ని తన తల్లికి ఇస్తానని, డబ్బును రైతుల కోసం ఖర్చు చేస్తానని అతను ప్రకటించాడు. 
                                                                        

Source From: bigboss 7 winner pallavi prasanth