షమీ మ్యాజిక్ : వరల్డ్ కప్ ఫైనల్లో భారత్


Published on: 15 Nov 2023 22:55  IST


ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో  భారత జట్టు 70 పరుగుల భారీ ఆధిక్యతతో న్యూజిలాండ్ జట్టుపై ఘన విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. 7 వికెట్లు సాధించి మొహమ్మద్ షమీ న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి వన్డేల చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ అత్యంత వేగంగా సెంచరీ సాధించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. శుభమన్ గిల్ 80 పరుగులు చేశాడు. మరో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్లో విన్నర్ ఫైనల్ లో భారత జట్టుతో తలపడనుంది. 

Source From: Icc cricket world cup