హీరోగా రాజీవ్‌ కనకాల తనయుడు.. టైటిల్‌ రిలీజ్‌ చేసిన రాజమౌళి

యాంకర్‌ సుమ, సినీ నటుడు రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్‌ చేశాడు.


Published on: 07 Oct 2023 20:04  IST

సినీ నటుడు రాజీవ్‌ కనకాల తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం టైటిల్‌ని దర్శకుడు రాజమౌళి శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. దీంతో పాటు సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాజమౌళి.. నటుడిగా రోషన్‌ తనదైన మార్క్‌ చూపించాలని, తల్లిదండ్రులు సుమ, రాజీవ్‌ గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. ఇంతకీ ఈ సినిమా పేరేమిటంటే ‘బబుల్‌ గమ్‌’. దానిని ప్రతిబింబించేలా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో హీరో రోషన్‌ బబుల్‌ గమ్‌ నములుతూ కనిపిస్తున్నాడు. యూత్‌ టార్గెట్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. 

రాజమౌళి చేతులమీదుగా ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో రోషన్‌ దీనిపై స్పందిస్తూ.. రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.  ’మీ ప్రతి సినిమా నాపై ఎంతో ప్రభావం చూపింది’ అని పేర్కొన్నారు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రాల దర్శకుడు రవికాంత్‌ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి మానస చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె కూడా ఈ చిత్రంతోనే సినీ రంగానికి పరిచయమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా షూటింగ్‌ గతేడాదే లాంఛనంగా ప్రారంభించారు.

Source From: Introducing Roshan Kanagala as a Hero