నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న వార్తలో నిజం లేదు

ఆయన ఒక ప్రముఖ నిర్మాత..ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ సినిమాలని నిర్మించిన ఆయన గురించి గత రెండు రోజుల క్రితం వచ్చిన ఒక న్యూస్ అయన కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులని కూడా ఎంతగానో కలవర పెట్టింది. దాంతో ఆయన తాజాగా మీడియా ముందుకొచ్చి తన గురించి వస్తున్న వార్తలకి చెక్ పెట్టాడు.


Published on: 02 Oct 2023 16:25  IST

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ది ఛార్జ్ షీట్ అలాగే ఇటీవలే రిలీజ్ అయిన  72 హోరియన్ అనే మూవీస్ ని తెరకెక్కించిన బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అశోక్ పండిట్.రెండు రోజుల క్రితం అశోక్ గుండెనొప్పికి గురయ్యాడని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందనే వార్తలు వచ్చాయి .దీంతో అశోక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతూ అశోక్ శ్రేయోభిలాషులు అశోక్ కి ఫోన్ చేసి ఆయన బాగానే ఉన్నారని తెలిసుకొని ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకి ఆయనే ఒక వీడియో రూపొందించి నేను బాగానే ఉన్నానని సామాజిక మాధ్యమం ద్వారా చెప్పారు.అలాగే రూమర్ సృష్టించిన వాళ్ళ మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యల్ని కూడా చేసాడు. 

అలాగే తమిళ నటుడు విశాల్ బాలీవుడ్ సెన్సార్ వాళ్ళు తన మార్క్ ఆంథోనీ  సినిమాకి 6 లక్షలు అడిగారని ఆ అమౌంట్ ని ఇచ్చి తన చిత్రాన్ని హిందీలో విడుదల  చేసానని చెప్పిన విషయం మీద కూడా పండిట్ స్పందించారు. విశాల్ చేస్తున్న ఆరోపణల మీద సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని నాకు తెలిసి బయట వాళ్ళు సెన్సార్ పేరు చెప్పి డబ్బులు తీసుకొని ఉంటారని  పండిట్ అన్నారు. కాశ్మీర్ పండిట్ అయిన అశోక్ ప్రొడ్యూసర్ గానే కాకుండా  గతం లో బాలీవుడ్ సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడుగా కూడా పని చేసాడు. 

Source From: హార్ట్ ఎటాక్