టాలీవుడ్ టాప్ హీరోతో రవీనా టాండన్ కూతురు రొమాన్స్..

తొంభయ్యవ దశకం లో భారతీయ చిత్ర పరిశ్రమని తమ అందంతో ఊపేసిన అతి కొద్ది మంది నటీమణుల్లో రవీనా టాండన్ కూడా ఒకరు. అక్షయ్ కుమార్ తో టిప్ టిప్ బర్సా పానీ అని ఆడి పాడినా బాలకృష తో స్వాతిలో ముత్యమంతా అని ఆడి పాడినా అది రవీనా టాండన్ కే చెల్లింది.


Published on: 03 Oct 2023 16:20  IST

ఆ రోజుల్లో కుర్రకారు మొత్తం రవీనా అందానికి ఫిదా అయినా వాళ్లే. ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ లో  కెజిఎఫ్ చాప్టర్ 2 లో ప్రధాన మంత్రి పాత్రలో పవర్ ఫుల్ గా నటించి ప్రేక్షకులందర్నీ తన అద్భుతమైన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇప్పడు రవీనా పెద్ద కూతురు తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఒక అగ్ర హీరో సరసన హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్త సంచలనం సృష్టిస్తుంది.

 

తెలుగు సినీ పరిశ్రమకి బాలీవుడ్ నుంచి ఎంతో మంది ముద్దుగుమ్మలు పరిచయమయ్యి టాలీవుడ్ లో తమ హవా ని కొనసాగించారు.లేటెస్ట్ గా శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది .ఇప్పుడు తాజాగా రవీనా కూతరు రాషా థడానీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంటర్ అవ్వబోతుంది. పైగా తాను ఎంట్రీ ఇవ్వబోతుంది మామూలు హీరో సరసన కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా రాషా గ్రాండ్ గా లాండ్ అవ్వడానికి రెడీ అవుతుంది.


రామ్ చరణ్ హీరో గా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్  సాన బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక కొత్త మూవీ ప్రారంభం కాబోతుందనే  విషయం అందరికి విదితమే. సుమారు 300 కోట్ల వ్యయంతో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలోనే  రాషా థడానీ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ వార్త భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తుంది.తన మొదటి సినిమా తోనే రామ్ చరణ్ లాంటి స్టార్ తో నటించే అవకాశం పొందినందుకు  రాషా చాలా అదృష్టవంతురాలని అంటున్నారు.ఇక రామ్ చరణ్ పక్కన రవీనా కూతురు  రాషా నటిస్తుందనే వార్తలతో మెగా అభిమానులు  ఆల్రెడీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రాషా పిక్స్ ని చూసి  రాషా తల్లిని మించిన అందగత్తె అనే ప్రశంసల్ని కురిపిస్తున్నారు.అలాగే రాషా ఫ్యూచర్లో తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ అయినా కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Source From: టాలీవుడ్