అన్నం పెట్టలేదని అమ్మమ్మను చంపేశాడు


Published on: 01 Aug 2024 21:06  IST

 

   అడిగిన వెంటనే అన్నం పెట్టలేదనే కోపంతో అమ్మమ్మను కిరాతకంగా చంపేశాడు ఒక మనుమదు. తన అమ్మమ్మను గోడకేసి కొట్టడంతో ఆమె తలకు గాయమై మృత్యువాతపడింది.  బాపట్ల జిల్లా మండల కేంద్రమైన కారంచేడులో షేక్‌ రాజాంబీ (75) భర్త మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తుంది. ఆమె మనుమడు (కుమార్తె కొడుకు) షేక్‌ బాజీ (28) కూడా తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతను మతిస్థిమితం లేనివాడిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన మనుమడు బాజీ అమ్మమ్మను అన్నం వడ్డించమన్నాడు. నేను తింటున్నాను కొద్ది సేపు ఉండు వడ్డిస్తానని చెప్పడంతో కోపోద్రికుడైన బాజీ ఆమె తలను పట్టుకొని గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఆమె చనిపోయాక కూడా బాజీ మాత్రం ఏమీ తెలియని వ్యక్తిలా ఇంట్లోనే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వృద్ధురాలు మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు గుంటూరులో ఉంటున్న రాజాంభీ అక్క కొడుకు షేక్‌ మస్తాన్‌వలికి సమాచారం ఇచ్చారు. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Source From: grand mother death