57 మంది డీఎస్పీలకు నో పోస్టింగ్‌


Published on: 01 Aug 2024 20:44  IST


    ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఏకంగా 57 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరందరినీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. తుళ్లూరు డీఎస్పీ అశోక్‌ కుమార్‌ గౌడ్, రాజంపేట డీఎస్పీ చైతన్యను రెండురోజుల క్రితమే బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. తుళ్లూరు డీఎస్పీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం రిటైర్‌ అయ్యారు. రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు ఆయన్ను బదిలీ చేయడం, మరో చోట పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించడం పోలీసు వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు 21 మంది సబ్‌ డివిజన్‌లకు కొత్త డీఎస్పీలను నియమించారు. వీరంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ఉండి ఇబ్బందులు పడిన వారే. వైఎస్‌ జగన్‌ హయాంలో మంచి పోస్టుల్లో ఉన్న వారందరినీ దాదాపు పక్కనపెట్టేశారు. అప్పట్లో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వారికి ఇప్పుడు మంచి పోస్టింగ్‌లు దక్కాయి. 

 

Source From: dsp transfers