పుణ్య స్నానాలకు వెళ్లి ఊబిలో కూరుకుపోయారు


Published on: 04 Dec 2023 21:06  IST

పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు మహిళలు ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనకాపల్లి జిల్లా, కశింకోట మండలంలోని పేరంటాలపాలెం శివారు జోగారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా జోగారావుపేట పక్కనే ఉన్న శారదానదిలో స్నానం ఆచరించడానికి గ్రామానికి చెందిన అరట్ల మంగ (37), మారపురెడ్డి లక్ష్మి (57) మరో ముగ్గురితో కలిసి వెళ్లారు. స్నానం అయ్యాక కార్తీక దీపాలు నదిలో విడిచిపెడుతున్నారు. ఇదే సమయంలో ముందుగా మంగ ఊబిలో పడిపోయి మునిగిపోసాగింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసిన లక్ష్మి కూడా ఊబిలో చిక్కుకుని మునిగిపోయింది. మిగిలిన వారు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి వెలికి తీయగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు.

Source From: Crime