డాక్యుమెంట్ రైటర్ ప్రాణం తీసిన భూ సెటిల్మెంట్లు


Published on: 29 Nov 2023 10:45  IST


ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో మంగ ళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య. పోలీసులు తెలిపిన ప్రకారం.. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభా కర్(60) సమీపంలోని అనంతపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూ సెటిల్మెంట్లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు ఆయన ఇంటికి వెళ్తుంటారు. అదే మాదిరిగా మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ ఇంటికి వచ్చారు. వాళ్లు ఆయనతో రూ.12 లక్షల విషయం ఏం చేశారని మాట్లాడు తుండటంతో భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని అక్కడే ఉన్న భార్య సావిత్రి లోపలకు వెళ్లి పోయారు. ఇంతలో రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె బయటకు రాగా అప్పటికే ప్రభా కర్ మృతి చెందినట్లు గుర్తించారు. దుండగులు ఇద్దరూ కారులో పరారయ్యారు. ఎస్పీ జగదీష్, కొవ్వూరు డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు, ఎస్సైలు ఘటనా స్థలాన్ని, సమీ పంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మృతుడు ఎక్కువగా భూమి సెటి ల్మెంట్లు చేస్తుంటారని, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

 

Source From: Telugu Peoples