దేశంలో టాప్‌ మద్రాస్‌ ఐఐటీ – వరుసగా 6వ సారి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో అగ్రస్థానం

మన దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థగా మద్రాస్‌ ఐఐటీ మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టి్టట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) తాజాగా ఉత్తమ విద్యా సంస్థల జాబితా–2024 విడుదల చేసింది. అందులో మద్రాస్‌ ఐఐటీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంస్థ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఆరవసారి. ఐఐఎస్‌సీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌స్టి్టట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కింద రూపొందించిన ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, వైద్యం.. ఇలా పలు విభాగాలు ఉన్నాయి.


Published on: 13 Aug 2024 11:31  IST

టాప్‌ విద్యా సంస్థలు (ఓవరాల్‌)
1. ఐఐటీ మద్రాస్‌
2. ఐఐఎస్‌సీ బెంగుళూరు
3. ఐఐటీ బాంబే
4. ఐఐటీ ఢిల్లీ
5. ఐఐటీ కాన్పూర్‌
6. ఐఐటీ ఖరగ్‌పూర్‌
7. ఎఐఐఎంఎస్‌ (ఎయిమ్స్‌), న్యూఢిల్లీ
8. ఐఐటీ రూర్కీ
9. ఐఐటీ గౌహతి
10. జేఎన్‌యూ, న్యూఢిల్లీ


టాప్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌
1. ఐఐటీ మద్రాస్‌
2. ఐఐటీ ఢిల్లీ
3. ఐఐటీ బాంబే
4. ఐఐటీ కాన్పూర్‌
5. ఐఐటీ ఖరగ్‌పూర్‌
6. ఐఐటీ రూర్కీ
7. ఐఐటీ గౌహతి
8. ఐఐటీ హైదరాబాద్‌
9. ఎన్‌ఐటీ తిరుచురాపల్లి
10. ఐఐటీ వారణాసి

టాప్‌ యూనివర్సిటీలు
1. ఐఐఎస్‌సీ, బెంగుళూరు
2. జేఎన్‌యూ, న్యూ ఢిల్లీ
3. జేఎంఐ, న్యూ ఢిల్లీ
4. మణిపాల్‌ అకాడమీ, మణిపాల్‌
5. బీహెచ్‌యూ, వారణాసి
6. ఢిల్లీ యూనివర్సిటీ
7. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
8. ఏఎంయూ, అలీఘర్‌
9. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, కోల్‌కత్తా
10. వీఐటీ, వెల్లోర్‌

టాప్‌ మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థలు
1. ఐఐఎం అహ్మదాబాద్‌
2. ఐఐఎం బెంగుళూరు
3. ఐఐఎం కోజికోడ్‌
4. ఐఐటీ ఢిల్లీ
5. ఐఐఎం కోల్‌కత్తా
6. ఐఐఎం ముంబయి
7. ఐఐఎం లక్నో
8. ఐఐఎం ఇండోర్‌
9. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌
10. ఐఐటీ బాంబే

టాప్‌ మెడికల్‌ కాలేజీలు
1. ఎఐఐఎంస్‌ (ఎయిమ్స్‌), ఢిల్లీ
2. పీజీఐఎంఈర్, చంఢీఘర్‌
3. క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ, వెల్లోర్‌
4. ఎన్‌ఐఎంహెచ్‌ఎన్‌ఎస్, బెంగుళూరు
5. జేఐపీజీఎంఈఆర్, పుదుచ్చేరి

టాప్‌ కాలేజీలు
1. హిందూ కాలేజీ, ఢిల్లీ
2. మిరిండా హౌస్, ఢిల్లీ
3. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజి, ఢిల్లీ
4. రామకృష్ణ మిషన్‌ వివేకానంద సెంటినరీ కాలేజీ, కోల్‌కత్తా
5. ఆత్మరామ్‌ సనాతన్‌ ధర్మ్‌ కాలేజీ, ఢిల్లీ
6. సెయంట్‌ గ్జేవియర్‌ కాలేజి, కోల్‌కత్తా
7. పీఎస్‌జీఆర్‌ కృష్ణమ్మల్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, కోయంబత్తూర్‌
8. లయోలా కాలేజీ, చెన్నయ్‌
9. కిరోరి మల్‌ కాలేజి, ఢిల్లీ
10. లేడీ శ్రీరామ్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్, ఢిల్లీ

టాప్‌ స్టేట్‌ యూనివర్సిటీలు
1. అన్నా యూనివర్సిటీ, చెన్నయ్‌
2. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, కోలకత్తా
3. సావిత్రిబాయ్‌ పూలే యూనివర్సిటీ, పూణే
4. కలకత్తా యూనివర్సిటీ, కోల్‌కత్తా
5. పంజాబ్‌ యూనివర్సిటీ, చంఢీఘర్‌
6. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌
7. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
8. భారతీయార్‌ యూనివర్సీటీ, కోయంబత్తూర్‌
9. కేరళ యూనివర్సిటీ, తిరువనంతపురం
10. సీయూఎస్‌ఎటీ, కొచ్చిన్‌

టాప్‌ న్యాయ విద్యా సంస్థలు
1. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగుళూరు
2. నేషనల్‌ లా యూనివర్సిటీ, బెంగుళూరు
3. నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌
4. ది వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యుడీషియల్‌ సైన్స్, కోల్‌కత్తా
5. సింబియోసిస్‌ లా స్కూల్, పూణే

టాప్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ కాలేజీలు
1. ఐఐటీ రూర్కీ
2. ఐఐటీ ఖరగ్‌పూర్‌
3. ఎన్‌ఐటీ కాలికట్‌
4. ఐఐఈఎస్‌టీ, షిబ్‌పూర్‌
5. స్కూల్‌ ఆఫ్‌ ప్లానిండ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, న్యూ ఢిల్లీ

టాప్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు
1. ఐజీఎన్‌ఓయూ (ఇగ్నో)
2. నేతాజి సుభాష్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, కోల్‌కత్తా
3. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ, అహ్మదాబాద్‌

ఇన్నోవేషన్‌ కేటగిరీ 
1. ఐఐటీ బాంబే
2. ఐఐటీ మద్రాస్‌
3. ఐఐటీ హైదరాబాద్‌
4. ఐఐఎస్‌సీ, బెంగుళూరు
5. ఐఐటీ కాన్పూర్‌
6. ఐఐటీ రూర్కీ
7. ఐఐటీ ఢిల్లీ
8. ఐఐటీ మండి
9. ఐఐటీ ఖరగ్‌పూర్‌
10. అన్నా యూనివర్సిటీ

అగ్రికల్చర్‌ అండ్‌ అనుబంధ రంగాల విద్యా సంస్థలు
1. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్, న్యూ ఢిల్లీ
2. ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్, కర్నాల్‌
3. పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, లుథియానా
4. బీహెచ్‌యూ, వారణాసి
5. ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇజాతనగర్‌


టాప్‌ రీసెర్చ్‌ విద్యా సంస్థలు 
1. ఐఐఎస్‌సీ, బెంగుళూరు
2. ఐఐటీ మద్రాస్‌
3. ఐఐటీ ఢిల్లీ
4. ఐఐటీ బాంబే
5. ఐఐటీ ఖరగ్‌పూర్‌

టాప్‌ డెంటల్‌ కాలేజీలు
1. సవీత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్స్, చెన్నయ్‌
2. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, మణిపాల్‌
3. మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, న్యూ ఢిల్లీ
4. కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ, లక్నో
5. డాక్టర్‌ డీవై పాటిల్‌ విద్యాపీuŠ‡, పూణే
 

Source From: IIT MADRAS-NIRF RANKING