మన దేశ తొలి రాజధాని అదే (పార్ట్‌–2)


Published on: 12 Nov 2023 17:45  IST


జాతీయోద్యమంతో బ్రిటీషర్లలో ఆందోళన

Food movement in West Bengal, 1959: Hunger pangs

    కానీ 1911 సంవత్సరంలో జాతీయోద్యమం బెంగాల్‌ రాష్ట్రంలో ఉధృతమవడం బ్రిటీషర్లను కలరవపెట్టింది. ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతుండడం వారికి తలనొప్పిగా మారింది. ఉద్యమాన్ని చల్లార్చేందుకు బెంగాల్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని విభజించి మరో రాష్ట్రం ఏర్పాటుచేశారు. కానీ దీనివల్ల ప్రజల నుంచి వారు ఊహించనంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక బెంగాల్‌ను మళ్లీ కలిపేయాల్సివచ్చింది. అయినా జాతీయోద్యమ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. కలకత్తా రాజధానిగా ఉంటే నిరసనలు ఎదుర్కోవడం, పరిపాలన సాగించడం కష్టమని బ్రిటీషర్లు గ్రహించారు. 

1911లో రాజధానికి ఢిల్లీకి మారింది

What were the reasons for moving the capital from Calcutta to Delhi during  the early 20th century? - Quora
    అందుకే 1911లో రాజధానిని ఢిల్లీకి మార్చాలని నిర్ణయించారు.    ఆ సంవత్సరం డిసెంబర్‌లో బ్రిటన్‌ ఐదో చక్రవర్తి కింగ్‌ జార్జి బ్రిటీష్‌ పరిపాలనలో ఉన్న భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తూ డిక్రీ జారీ చేశాడు. ముస్లిం రాజులు, మొఘలులకు గతంలో రాజధానిగా ఉండి మహాసామ్రాజ్య లక్షణాలు ఉండడంతో ఢిల్లీని రాజధానిగా ఎంపిక చేశారు. కలకత్తాలో లాగా ఇక్కడ ఉద్యమ ప్రభావం అంతగా లేదు. అందుకే రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. యమునా నది ఒడ్డున పాత ఢిల్లీ పక్కన 1912లో రాజధాని నిర్మాణం ప్రారంభించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో కొత్త ఢిల్లీ నగరాన్ని నిర్మించి రాజధానిగా అభివృద్ధి చేశారు. కానీ అప్పటి వరకూ దేశ రాజధానిగా కలకత్తా సేవలందించింది. ఇప్పటికీ కలకత్తా నగరంలో బ్రిటీషర్లు కట్టిన భవనాలు రాజధాని రాజసంతో ఠీవిగా కనిపిస్తూనే ఉన్నాయి.  రాజధాని కాకపోయినా కలకత్తా నగరం దేశంలో తన ప్రత్యేకతను కోల్పోలేదు. 


 

Source From: india first capital