మన దేశ తొలి రాజధాని అదే

మన దేశ రాజధాని ఢిల్లీ. స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచే ఢిల్లీ మన రాజధానిగా ఉంది. అసలు ఎప్పటి నుంచి ఢిల్లీ దేశ రాజధానిగా ఉంటోంది. అంతకుముందు మరో చోట రాజధాని ఉండేదా.. అవును.. మన తొలి రాజధాని ఢిల్లీ కాదు.. మొఘల్‌ చక్రవర్తులు, కొందరు ముస్లిం రాజుల కాలంలో ఇప్పటి పాత ఢిల్లీ రాజధానిగా ఉన్న అది భారతదేశం మొత్తానికి రాజధానిగా పరిగణలోకి రాలేదు. బ్రిటీష్‌ ఇండియాలో మొదటి నుంచి ఢిల్లీ రాజధానిగా లేదు. ఢిల్లీకి ముందు ముందు సుదీర్ఘకాలం బ్రిటీష్‌ పాలనలో దేశ రాజధానిగా మరొక ప్రఖ్యాత నగరం ఉండేది.


Published on: 12 Nov 2023 17:24  IST


బ్రిటీషర్ల మొదట ప్రాధాన్యత ఆ నగరమే

Kolkata - Wikipedia

    మన దేశ తొలి రాజధాని కలకత్తా.. అదే ఇప్పటి కోల్‌కతా.. 1911 సంవత్సరం వరకూ కలకత్తా భారతదేశ రాజధానిగా కొనసాగింది. దాదాపు 139 సంవత్సరాలపాటు కలకత్తా నగరం మన రాజధానిగా ఉంది. బ్రిటీషు వాళ్లు అక్కడి నుంచే దేశం మొత్తాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేవారు. కోల్‌కతాలో ఇప్పుడు కనిపించే రైటర్స్‌ బిల్డింగ్‌ సహా అనేక బిల్డింగులు రాజధానిగా ఉండగా బ్రిటీషర్లు కట్టినవే.. రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు కలకత్తాను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. బ్రిటీష్‌వారు దేశంలో అడుగుపెట్టే సమయానికి కలకత్తా మొగల్‌ సామ్రాజ్యంలోని బెంగాల్‌ రాష్ట్రంలో ఒక గ్రామం. అప్పట్లో బెంగాల్‌ రాజధాని ముర్షిదాబాద్‌..  కలకత్తాకు 60 కిలోమీటర్ల దూరంలో ముర్షిదాబాద్‌ ఉంది. 

ఈస్టిండియా కంపెనీతో మొదలు

My Tryst with East Indian Company History – History Of India
    1697 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ ఏజెంటుగా ఉన్న చార్నాక్‌ అనే బ్రిటీషర్‌ కలకత్తాలో వ్యాపారం మొదలుపెట్టాడు. మరుసటి సంవత్సరమే అతని ద్వారా ఈస్టిండియా కంపెనీ సుతానుతి, కలకత్తా, గోబింద్‌పూర్‌ గ్రామాలను స్థానిక భూస్వామి సబర్నా చౌదరి నుంచి కొనేసింది. అప్పటి నుంచి ఈ మూడు గ్రామాలను కలిపి ప్రెసిడెన్సీ సిటీగా డెవలప్‌ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా తమకు అవసరమైన బిల్డింగులు, రోడ్లు, రైలు మార్గాలు, పరిపాలన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. కలకత్తా నగర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి హాల్‌వాల్‌ అనే తమ వ్యక్తినే మేయర్‌గా నియమించారు. బ్రిటీషర్లు నెమ్మదిగా పట్టు బిగిస్తుండడంతో వారి ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి 1756లో మొఘల్‌రాజు సిరాజుద్‌దుల్లా కలకత్తాపై దాడి చేశాడు. నగరాన్ని స్వాధీనం చేసుకుని దాని పేరును అలీనగర్‌గా మార్చాడు. కానీ ఒక సంవత్సరంలోనే ప్లాసీ యుద్ధంలో సిరాజుద్‌తుల్లాను బ్రిటీషర్లు ఓడించి మళ్లీ కలకత్తాను చేజిక్కించుకున్నారు.

కలకత్తాను రాజధానిగా మార్చింది ఆయనే

Warren Hastings - Wikipedia

    ఇండియాపై పూర్తి ఆధిపత్యం వచ్చాక 1772లో వారెన్‌ హేస్టింగ్స్‌ను తొలి వైశ్రాయ్‌ జనరల్‌గా ఇంగ్లాండు ప్రభుత్వం నియమించింది. హేస్టింగ్స్‌ కలకత్తాను రాజధానిగా మార్చాడు. అప్పటివరకూ బెంగాల్‌ రాజధానిగా ఉన్న ముర్షిదాబాద్‌ నుంచి ముఖ్యమైన పరిపాలనా కార్యాలయాలన్నింటినీ ఒక్కొక్కటీగా కలకత్తాకు మార్చాడు. మొదట సుప్రీంకోర్టు జస్టిస్, సుప్రీం రెవెన్యూ పరిపాలనను కలకత్తాకు షిప్ట్‌ చేశాడు. ఆ తర్వాత అన్ని కార్యాలయాలు ముర్షిదాబాద్‌ నుంచి కలకత్తాకు మారిపోయాయి. 

కలకత్తాయే ఎందుకంటె?

Kolkata: కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..? -  all you need to know about fun facts of kolkata and west bengal - Samayam  Telugu

    అప్పట్లో దేశంలో బొంబాయి, మద్రాసు వంటి చాలా నగరాలున్నా బ్రిటీషర్లు కలకత్తాను రాజధానిగా చేసుకోవడానికి  కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు రావడానికి కలకత్తా వారికి ఎంట్రీ పాయింట్‌గా ఉండేది. మన దేశంలోని సరుకులు, వస్తువులను ఇంగ్లాండుకు తరలించేందుకు అనువుగా అప్పటికే అద్భుతమైన పోర్టు ఉంది. సమీపంలోని బర్మా ఇతర దేశాలను కంట్రోల్‌ చేయడం కలకత్తా నుంచి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అన్నింటికీ మించి భారతదేశానికి సరిహద్దుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, రష్యా నుంచి తమ ఆధీనంలో ఉన్న ఇండియాను కాపాడుకోవడం సులభం. అందుకే దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి బ్రిటీషర్లు కలకత్తాపైనే దృష్టి పెట్టారు. వారి హయాంలో 1800 సంవత్సరం నాటికి కలకత్తా ఒక నగరంగా అభివృద్ధి చెందింది. సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. దేశంలోని అన్ని రాజకీయ ఉద్యమాలకు అప్పట్లో కలకత్తా వేదికగా ఉండేది. 

 .... చివరి భాగం పార్ట్‌–2లో చదవండి
 

Source From: india first capital