ఈగల అంతరిక్ష యానం.. సరికొత్త ప్రయోగం

ఈగల స్పేస్​ జర్నీ చేసి వారం పాటు అంతరిక్షంలోనే ఉంటాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉందా. ఇది ముమ్మాటికీ నిజం. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్​ మిషన్​లో వ్యోమగాములతో పాటు ఈగలను కూడా పంపనుందని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈగలు అంతరిక్షంలోకి వెళ్లి ఏం చేస్తాయి? వాటివల్ల వచ్చే లాభాలేమిటి? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ఈగలను స్పేస్​లోకి పంపించడానికి ప్రత్యేక కారణం ఉందని ఇస్రో చెబుతోంది. అంతరిక్షంలో వ్యోమగాములకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను పరిశీలించేందుకు ఈగలను ఇస్రో పంపింస్తోందట.


Published on: 27 Aug 2024 17:58  IST

ఆ విషయం తెలుసుకునేందుకే


కర్ణాటక ధార్వాడ్​లోని అగ్రికల్చరల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం (UAS)లోని బయోటెక్నాలజీ విభాగంలోని సభ్యులు ఈ ఫ్రూట్‌ ఫ్లైస్​ (పండు ఈగల)ను అభివృద్ధి చేశారు. ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఒక్కో కిట్​లో 15 చొప్పున ఉంటాయి. ఇవన్నీ గగన్​యాన్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించి, వారం పాటు అక్కడ జీరో గ్రావిటి కక్ష్యలో ఉండనున్నాయి. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీనితో పాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈగలను అంతరిక్షంలోకి పంపిస్తోంది.
***
అంతరిక్షంలో అవి ఏం తింటాయ్ !


భారతీయ వ్యోమగాములకు అంతరిక్ష యానంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలకు చికిత్సను కనుక్కొవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని ధార్వాడ్ యూఏఎస్ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి కుమార్ హోసమణి అభిప్రాయపడ్డారు. పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన ఈగలకు కూడా సోడియం ఆక్సలేట్, ఇథైల్‌ గ్లైకోల్, హైడ్రాక్సీ ఎల్ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి, బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తామని వెల్లడించారు. దీంతో ఈగల్లోనూ రాళ్లు ఏర్పడతాయని వెల్లడించారు.

వ్యోమగాముల_ఆరోగ్యాన్ని_కాపాడుతుంది'
"2025లో ఇస్రో అంతరిక్షంలోకి మానవులను పంపొచ్చు. అయితే అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల్లో 30 సార్లు కిడ్నీలో రాళ్లు కనిపించాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈసారి ఈగలను కూడా అంతరిక్షంలోకి పంపిస్తున్నాం" అని అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి కుమార్ హోసమణి తెలిపారు. "వ్యోమగాముల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం అవసరమని యూఏఎస్ ఛాన్సలర్ డాక్టర్ పీఎల్ పాటిల్ తెలిపారు. ఈ విషయాన్ని కనుక్కొంటే వ్యోమగాముల ఆరోగ్యాన్ని కాపాడొచ్చని అన్నారు

Source From: musquitos space journey