ఇకపై సులభంగా లేఅవుట్ అనుమతులు

భవన నిర్మాణాలు,లేఅవుట్ లఅనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గానూ ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017 , ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్- 2017లో సవరణలు తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం వేరువేరుగా జీవోలు జారీ చేసింది.


Published on: 10 Jan 2025 17:01  IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లేఅవుట్ ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చింది. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెప్పింది. లేఅవుట్ ల్లో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ కీలక సవరణ తీసుకువచ్చింది. అంతేకాకుండా 500 చ.మీ పైబడిన స్థలాల్లో నిర్మాణాల్లో సెల్లార్ కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ , సబ్ రిజిస్ట్రార్లు జోక్యంను తొలగించాలని, రాష్ట్ర, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థలాల అభివృద్ధి కోసం 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాగ్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల రాష్ట్రంలో నిర్మాణరంగం మరింత పుంజుకుంటుందని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

Source From: రాజాజీ