ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. మార్గదర్శకాలు ఇవే

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 వరకు అనుమతించింది. ఎక్సైజ్‌ శాఖలో మాత్రం సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని, సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఆ శాఖల్లో బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వులిచ్చింది. ఎక్సైజ్‌ శాఖలో సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.


Published on: 17 Aug 2024 23:17  IST

బదిలీలు చేసే శాఖలు
   రెవెన్యూ (భూపరిపాలన), సెర్ఫ్‌,  పంచాయత్ రాజ్- గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,  అర్బన్ డెవలప్‌మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌరసరఫరాలు,  మైనింగ్- జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్ట్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు-రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్.

మార్గదర్శకాలు
 
* ఐదు సంవత్సరాలగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల తప్పనిసరిగా బదిలీ చేయాలి.

* ఒకే చోట ఐదేళ్లుగా పనిచేసిన ఉద్యోగులే కాకుండా ఇతర ఉద్యోగులకు కూడా  పరిపాలన అవసరలాలపై లేదా వ్యక్తిగత అభ్యర్ధలనలపై బదిలీలకు అర్హులు.

* ఎన్నికల ప్రక్రియ కోసం చేసిన బదిలీలను బదిలీగా పరిగణించరు.

* దృష్టి లోపం ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు బదిలీ చేయాలని కోరేవారికి, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు, వైద్య కారణాలపై బదిలీలు కోరుకునే ఉద్యోగులకు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు) క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా, అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్‌లకు కోరుకునే వారు.  కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులు అయిన మహిళా ఉద్యోగులు, దృష్టిలోపం గల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.

* దృష్టిలోపం గల ఉద్యోగులు బదిలీ కోసం నిర్దిష్ట అభ్యర్దన చేస్తే స్పష్టమైన ఖాళీ ఉంటే ఆ ప్రదేశంలో పోస్టింగ్‌ ఇవ్వవచ్చు.

* భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినట్లయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్‌లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్‌లలో పోస్ట్ చేయడానికి ప్రయత్నించాలి.

*  ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభావితమయ్యే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్ధన బదిలీలుగా పరిగణిస్తారు. 

* ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలి. నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీల పోస్టులను ముందు భర్తీ చేయాలి.

* ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధిపతలు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను చేపట్టాలి.

* నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగుల కోరిన చోటకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ పరిధిల్లో బదిలీ ఉద్యోగులు 50 ఏళ్లలోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల వారి స్థానంలో ప్రత్యామ్నాం లేకుండా రిలీవ్‌ చేయడానికి వీల్లేదు. 

* జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను చేయాలి.

* ప్రాధాన్యత విషయంలో దుర్వినియోగం లేకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరకాస్తులను పరిశీలన చేసి, తగిన సిఫార్సు చేయాలి.

* నిబంధనల మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో చర్యలు తీసుకోవాలి.

Source From: Employees transfers in ap