బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త! త్వరలోనే ఆర్బీఐ కీలక నిర్ణయం


Published on: 21 Feb 2024 11:24  IST



దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ చెల్లింపు దారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పనుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్.

ఢిల్లీలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది జర్నలిస్ట్లతో సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్ధికంగా బలంగా ఉందని, పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5 శాతం ఉందని చెప్పారు. కాబట్టే త్వరలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత ఏడాదిన్నర కాలంలో ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్ల తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుంది.

*వడ్డీ రేట్లను తగ్గిస్తే*

సెంట్రల్ బ్యాంక్ .. దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తుంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్‌బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటుంది. అయితే, ఈ ఇంట్రస్ట్ రేటు ఎక్కువగా ఉంటే.. సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్ పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రస్ట్ రేటు తక్కువగా ఉంటే ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది.

అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తుంది. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పియూష్ గోయల్ చెప్పినట్లు ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం తగ్గనుంది.

Source From: Citizen