ఈ 7 పనులు చేస్తే మతి మరుపును దూరం చేయొచ్చు

మతి మరుపు రెండు రకాలుగా ఏర్పడుతుంది. మొదటి రకం శారీరక డ్వామెజ్ ద్వారా జరుగుతుంది. రెండవది మానసిక డ్యామేజ్ ద్వారా ఏర్పడేది. మొదటి రకం మతి మరుపును నివారించాలంటే మందులే మార్గం. రెండవ రకాన్ని నివారించాలంటే మెడిటేషన్. అందుకు ఏకాగ్రత అనే మనోదీపాన్ని వెలిగించాలి. సంకల్పాలను ఆలోచనలను ఉత్పత్తి చేసే కర్మాగారం మనిషి మనసు. అటువంటి మనసు నిద్రాణమైనప్పుడు జ్ఞాపకశక్తిని కోల్పొవడం జరుగుతుంది. దాన్ని పునరుద్ధరించూకోవాలంటే పూజా పునస్కార రహిత పాజిటీవ్ సంకల్పాల మెడిటేషన్ తో నిద్రాణమైన మనసును నిద్రలేపాలి.


Published on: 18 Dec 2023 10:45  IST


         
కింద ఇచ్చిన సలహాలను పాటిస్తే మతిమరుపు అదుపులో ఉంటుంది.

1. ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యడం.

Benefits of exercise: 10 health problems that workout can prevent |  HealthShots

2. మెదడును యాక్టివ్ గా ఉంచుకోవడం. అంటే మెదడుకు మేత పెట్టే ప్రహేళికలు (పజిల్స్), పదవినోదం, సుడోకు లాంటివి రోజూ సాధన చేస్తూ ఉండటం.

20 Best Brain Games for Kids

3. మెమరీకి సంబంధించిన ఆటలు ఏదైనా ఆడుతూ ఉండటం. ఉదాహరణకు ఎవరినైనా కొన్ని వస్తువులు ఒక గదిలో పెట్టమని, వాటిని మీరు ఒక నిమిషం పాటు చూసి బయటకు వచ్చి, ఏమేం చూసి వచ్చారో అన్నీ గుర్తు చేసుకుని చెప్పడం, రాయడం. ఇది పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆడించవచ్చు. ఇది మా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ ఆడించేవారు. ఇంటర్నెట్ లో వెతికితే మరిన్ని ఆటలు దొరకవచ్చు. కానీ శ్రద్ధగా సాధన చేయడం ముఖ్యం.

4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నింటికీ మంచిది.

13 Essential Foods For Any Healthy Refrigerator AKA The Easy Healthy  Grocery Shopping List For Fitness And Nutrition

5. నలుగురితో ఉల్లాసంగా గడపడం. ఇందువల్ల నిద్రాణమైన జ్ఞాపకాలు బయటికి వచ్చి జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

50 Fun, Free Ways to Have a Great Time With Friends

6. ఇంట్లో మీరు వాడే వస్తువులను క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల, ఏది ఎక్కడ ఉంటుందో సులభంగా గుర్తుంటుంది. ఉదాహరణకు మీ కళ్ళజోడు ఎప్పుడూ బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద ఉంచే అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కనబడనప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి వెతకచ్చు, ఇంట్లోవాళ్ళెవరైనా ఆ చోటు మార్చేస్తే తప్ప.

7. మంచి నిద్ర కేవలం మతిమరుపు నివారించడానికే కాదు, పూర్తి ఆరోగ్యానికి అవసరం. మంచి నిద్రలో మెదడు సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మరిచిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి.

Best and Worst Sleep Positions for Health Conditions

Source From: Telugu Peoples