డీప్‌ ఫేక్‌లపై భారీ జరిమానా! – కేంద్రం కీలక నిర్ణయం

డీప్‌ ఫేక్‌ వీడియోలు, ఫొటోలు సృష్టిస్తూ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అలాంటి వీడియోలను సృష్టించేవారికి, వాటిని వ్యాప్తి చేసేందుకు కారణమయ్యే సోషల్‌ మీడియాకు కూడా భారీ జరిమానా విధించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. త్వరలో దీనిపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు.


Published on: 24 Nov 2023 10:59  IST

డీప్‌ ఫేక్‌ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సోషల్‌ మీడియా సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పై పనిచేసే నిపుణులతో చర్చించింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతూ వివరాలు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ డీప్‌ ఫేక్‌ రూపంలో మన ప్రజాస్వామ్యానికి సరికొత్త ముప్పు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

'సబ్సిడీపై స్మార్ట్‌ఫోన్లు'.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందన | Central  Minister Ashwini Vaishnav Reaction On Subsidy For Smartphones Proposals -  Sakshi

దీనిపై సోషల్‌ మీడియా సంస్థలతో జరిగిన సమావేశంలో తాము నాలుగు అంశాలపై కీలకంగా చర్చించామని మంత్రి వివరించారు. డీప్‌ ఫేక్‌ లను గుర్తించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ఆ ముసాయిదా రూపకల్పనను నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను సవరించడమో.. లేకపోతే కొత్త చట్టం తీసుకురావడమో చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. డిసెంబరు తొలి వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామన్నారు.

ఇటీవల సినీతారలు రష్మిక, కాజోల్, కత్రినా కైఫ్, సచిన్‌ కుమార్తె సారా సహా పలువురు సెలబ్రిటీల డీప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో టెక్నాలజీ దుర్వినియోగంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రధాని మోదీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. డీప్‌ ఫేక్‌లు సమస్యాత్మకంగా మారుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైన కేంద్రం గురువారం సోషల్‌ మీడియా సంస్థలతో సమావేశమైంది. 
 

Source From: Telugu Peoples