ఏపీలో 7 కొత్త విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.


Published on: 27 Aug 2024 23:07  IST


ఏపీలో ఏడు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబరులో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని చెప్పారు. విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసరం ఉంటుందని, ఈ సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందని తెలిపారు.
సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ దక్కిందని, కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై తాను మాట్లాడనని తెలిపారు.
 

Source From: Central minister Rammohan Naidu