ట్రెండ్ సెట్ చేస్తున్న 'సలార్' ట్రైలర్


Published on: 02 Dec 2023 18:38  IST

కేజీఎఫ్‌–2 తర్వాత భారీ, అంచనాలతో వస్తున్న సలార్‌ మూవీ ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గంటల వ్యవధిలోనే దీనికి రికార్డు స్థాయి వ్యూస్‌ వచ్చి ట్రెండ్‌ సృష్టిస్తోంది. ఇందులో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోయిజం, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ మెథడ్స్‌కి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

  అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్షన్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ అంచనాలు ఇంకా రెట్టింపయ్యాయి. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ ‘సలార్‌ కథ 15 ఏళ్ల క్రితమే అనుకున్నాను. కానీ, నా మొదటి సినిమా ’ఉగ్రం’ చేసిన తర్వాత ’కేజీఎఫ్‌’ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాను. అది రెండు భాగాలు పూర్తయ్యే సరికి 8 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత సలార్‌ పనులు ప్రారంభించాం. సినిమా మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేశాం’ అని అన్నారు. ఇక ‘సలార్‌’ రెండో భాగానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రశాంత్‌ చెప్పారు. సలార్‌ మూవీని రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ను సలార్‌ : సీజ్‌ ఫైర్‌ పేరుతో విడుదల చేయనున్నారు.

బద్ద శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ’సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా కనిపించనున్నారు.

https://youtu.be/4GPvYMKtrtI?si=-qqs6vK0FhplYFMK

 

Source From: Salar movie