'సీనియర్ నటి అపార్ట్ మెంట్‌'లో సూసైడ్!

ఈ జనరేషన్ లో పిల్లల్ని చూస్తుంటే రోజురోజుకి భయమేస్తుంది. ఒక పిల్లాడు సొసైటీలోని 35 వ ఫ్లోర్ నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అసలు లైఫ్ అంటే ఇంతేనా అంటూ షానూర్ సనా


Published on: 03 Oct 2023 16:05  IST

 తనకి ఎదురైన ఒక సంఘటనని యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ద్వారా పంచుకుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఏదో డిప్రెషన్ లో ఉండి, చాక్లెట్ తినుకుంటూ 35వ ఫ్లోర్ కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడంట. " వాళ్ళ అమ్మానాన్నలకి ఎంత బాధగా ఉంటుంది అసలు, మరీ చనిపోయేంత ప్రాబ్లమ్స్ ఏం ఉంటాయి. ఎందుకో తెలియదు పిల్లలు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే అమ్మ నాన్నలతోనో, స్నేహితులతోనో పంచుకోవాలి. కౌన్సిలింగ్ కి వెళ్ళాలి గానీ ఇలా సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ అనేది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాదు కదా" అంటూ సనా ఈ వ్లాగ్ లో చెప్పింది.


సీనియర్ నటి షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి  సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది. సనా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సన. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా. 

 

తాజాగా తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా. ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తన యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా.. కెరీర్ లో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా. కొన్ని రోజుల క్రితం ' మా ఇంట్లో విచిత్రాలు జరుగుతున్నాయి' అంటు పోస్ట్ చేసిన వ్లాగ్  అత్యధిక వీక్షకాధరణ పొందింది. ఇప్పుడు ' ప్రాణం వదులుకోవడం సొల్యూషన్ కాదు' అంటూ సనా పోస్ట్ చేసిన ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.

Source From: సీనియర్ నటి