పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో బెయిల్స్‌

సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో బెయిల్స్‌ లభించాయి. అన్ని కేసుల్లో బెయిల్స్‌ ఇచ్చిన సంబంధిత న్యాయస్థానాలు. ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్స్‌ లభిస్తే, నిన్న నర్సారావుపేట కోర్టు బెయిల్‌, అంతకుముందే రాజంపేట కోర్టు బెయిల్‌ లభించాయి. 


Published on: 11 Mar 2025 20:20  IST

అమరావతి: 
కక్షసాధింపులో భాగంగా పోసాని కృష్ణమురళిపై  మొత్తంగా 17 కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు
ఏళ్ల కిందట ప్రెస్‌మీట్లో మాట్లాడిన అంశాలకు ఇప్పడు కేసులు పెట్టిన పోలీసులు
పోసానికి న్యాయపరమైన ఊరట లభించకుండా ప్రభుత్వం పన్నాగం
అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు
ఎక్కడెక్కడ కేసులు పెట్టింది కూడా బయటకు రానీయకుండా పోలీసులతో సర్కారు పన్నాగం
తద్వారా బెయిల్స్‌ వేయనీయకుండా కుట్ర చేసిన ప్రభుత్వం
ఒక్కో కేసులో పీటీ వారెంట్‌ కోరుతూ వందలకొద్దీ కిలోమీటర్లు తిప్పిన పోలీసులు 
హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు, తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు, అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తిప్పిన పోలీసులు
67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా వేధించి అనారోగ్యానికి గురిచేయాలన్న ఎత్తుగడతో ప్రభుత్వం
ఈ కుట్రను హైకోర్టుకు నివేదించిని వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్‌, సమర్థవంతంగా వాదనలు 
ప్రభుత్వ పన్నాగానికి పుల్‌స్టాప్‌ పెట్టిన హైకోర్టు
నమోదైన కేసుల్లో 35 A నోటీసు ఇవ్వాలన్న ఆదేశాలు 
విశాఖపట్నం ఒన్‌టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలు
హైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించిన వైయస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌
ఒక్కొక్కటిగా బెయిల్స్‌ 
పోసానికి పూర్తిగా అండగా ఉన్న వైయస్సార్‌సీపీ 
అన్ని కేసుల్లో బెయిల్‌ పొందిన పోసాని 
రేపు విడుదలయ్యే అవకాశం

Source From: రాజాజీ