విశాఖ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి రైలు మార్గంలో ఉత్తర ప్రదేశ్ కు దాదాపు 17.9 కేజీల గంజాయిని రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లాస్టిక్ చాపలలో గంజాయిని పెట్టి రవాణా చేసేందుకు వీరు ప్రయత్నించారు. ఇటీవలే కొరియర్ సర్వీస్ ద్వారా గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు గంజాయి ముఠా చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ పోలీసుల కళ్ళు గప్పి కొత్త మార్గాల్లో గంజాయిని రవాణా చేసేందుకు గంజాయి ముఠాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.


Published on: 12 Mar 2025 11:29  IST

Source From: రాజాజీ