పవన్‌ కళ్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ

పవన్‌ కళ్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ అని వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఎప్పుడైనా చూశామా? ఇక్కడ చంద్రబాబు చేశాడు. అయినా శ్రీకాకుళంలో టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు కదా? ఎందుకంటే, అక్కడ రిగ్గింగ్‌ సాధ్యం కాలేదు. 


Published on: 05 Mar 2025 15:18  IST

ప్రతిపక్ష హోదాపై వైయస్ జగన్ మాట్లాడుతూ గతంలో మేము చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చాం. ఇంత మంది సభ్యులు ఉంటేనే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా రూలింగ్‌ లేదు. ఢిల్లీలో 80 స్థానాల్లో బీజేపీ కేవలం మూడు మాత్రమే ఉన్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ మేం కూడా టీడీపీకి ఇచ్చాం. నాడు 5గురు టీడీపీ ఎమ్మెల్యేలు మా వైపు వచ్చి కూర్చున్నారు. ఇంకా చాలా మంది రెడీ అయ్యారు. అలా వారి బలం తగ్గినా, మేము ఆయనకు ప్రతిపక్షనేత హోదా ఇచ్చాం. ఎంతసేపు అయినా ఆయన్ను మాట్లాడమని కోరాను.ఆయనకు, నాకు అదే తేడా. అసెంబ్లీలో ఉన్నది ఎవరు? మీరు కూటమితో అధికారంలో ఉన్నారు. అంటే ఉన్నది రెండే పార్టీలు. వేరే పార్టీ లేనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మాకే గుర్తింపు ఇవ్వాలి కదా? ఆ పార్టీ లీడర్‌ను ఏమంటారు? ప్రతిపక్ష నేత అంటారు కదా? సభలో లీడర్‌కు ఎంత సమయం ఇస్తారో, ఆ తర్వాత అంతే సమయం విపక్షనేతకు ఇవ్వాలి కదా? కానీ, నీవు విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు అనుకుంటున్నావు కాబట్టి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. మాకు సభలో మైకు ఇస్తేనే కదా, మాట్లాడే అవకాశం వస్తుందని అన్నారు.
    

Source From: Telugu Peoples

లేటెస్ట్ న్యూస్